Rushikonda Vs Sheesh Mahal: దేశంలో ఇద్దరు మాజీ సీఎంలు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఒకరు జగన్ కాగా, మరొకరు కేజ్రీవాల్. సీఎంలుగా ఉన్నప్పుడు వారు కట్టించుకున్న భవనాలు వార్తల్లోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడు వాటిని ప్రజల సందర్శన కోసం ఓపెన్ చేశారు.. చేయిస్తున్నారు. ఇప్పటికే శీష్‌మహల్ ఓపెన్ కాగా, రేపో మాపో జగన్ రుషికొండ ప్యాలెస్ వంతైంది.
మాజీ సీఎం జగన్ ఎంతో కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ ప్రజలకు ఓపెన్ వచ్చే నెల నుంచి కాబోతోంది. అందులో ఉన్న ప్రతీ వస్తువుకు ప్రైస్ ట్యాగ్ పెట్టి మరీ ప్రజలకు చూపించబోతోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజల సొమ్మును ఏ విధంగా ఖర్చు చేశారన్నది ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించబోతోంది. అందులోని ప్రతీ వస్తువు విదేశాల నుంచి రప్పించినట్టు పుంకాను పుంకానుగా వార్తలు వచ్చాయి.
చివరకు బాత్రూమ్ లోని వస్తువులు విదేశాల నుంచి రప్పించారు. పని చేసే టెక్నీషియన్లు తప్పితే అందులోని వస్తువులను మూడో కంటికి తెలియకుండా విదేశాల నుంచి రప్పించారని ప్రభుత్వం లెక్కలను బయటపెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా రుషికొండ ప్యాలెస్ తెరవపోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం చంద్రబాబు కేబినెట్ భేటీ అయ్యింది. రుషికొండ ప్యాలెస్‌ను ప్రైవేటు వారికి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అంతకుముందు ప్రజలకు రుషికొండ ప్యాలెస్ ను ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యింది.
రుషికొండ ప్యాలెస్‌లోకి సందర్శకులను అనుమతించాలన్న కేబినెట్ నిర్ణయంతో తప్పుడు ప్రచారానికి తెరలేపింది వైసీపీ. అమరావతిలో చదరపు అడుగుకు రూ.30 వేలు ఖర్చు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. అసలు జగన్ హయాంలో రుషికొండ ప్యాలెస్‌లో చదరపు అడుగు రూ.30 వేలు ఖర్చు చేశారన్నది ప్రభుత్వ వాదన. అమరావతి నిర్మాణాలు పూర్తయ్యాక ప్రజల కోసం ప్రభుత్వం వాటిని ఓపెన్ చేస్తుంది, ఆ తర్వాత ఖర్చు గురించీ వివరాలు బయట పెట్టనుంది.