Prasidh Krishna concussion substitute for Akash Deep: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండు టెస్ట్ సందర్భంగా మూడో రోజు టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన వీరుడు ఆకాశ్ దీప్ కు తీవ్ర గాయం అయింది. బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో న్యూజిలాండ్ బౌలర్ జెమీసన్ వరుసగా బౌన్సర్లు వేయగా.. ఓ బంతి ఆకాశ్ దీప్ హెల్మెట్ కు బలంగా తగిలింది. ఈ క్రమంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణను టీమిండియా మేనేజ్మెంట్ రంగంలోకి దింపింది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను సత్తా చాటిన ఆకాశ్ దీప్.. రెండో ఇన్నింగ్స్ కు దూరం కావడం భారత జట్టుకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. దీంతో ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఆకాశ్ దీప్ కు గాయం కావడంతో ప్రసిద్ కృష్ణను బరిలోకి దింపాడు గౌతమ్ గంభీర్. ఈ క్రమంలో మళ్లీ గౌతమ్ గంభీర్ ట్రోల్స్ నడుస్తున్నాయి. మహమ్మద్ సిరాజ్ లాంటి వరల్డ్ క్లాసు బౌలర్ ఉండగా.. మళ్లీ ఆ పాచిపోయిన ప్రసిద్ కృష్ణను ఎందుకు తీసుకువచ్చారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి టెస్ట్ సందర్భంగా విఫలమైనందుకు ప్రసిద్ కృష్ణను పక్కకు పెట్టిన టీమిండియా మేనేజ్మెంట్..కంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద మళ్లీ ఎందుకు తీసుకువచ్చిందని నిలదీస్తున్నారు. ఒక్కసారైనా మహమ్మద్ సిరాజ్ గురించి ఆలోచించకుండా.. గ్రేగ్ చాపెల్ తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ప్రసిద్ కృష్ణ గనుక ఒక్క వికెట్ తీయకపోతే.. టీమిండియా ఓటమికి గౌతమ్ గంభీర్ కారణమవుతాడని పోస్టులు పెడుతున్నారు.
బ్యాటర్ హెల్మెట్ తల లేదా మెడ భాగంలో బంతి బలంగా తగిలినప్పుడు డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు రంగంలోకి దిగుతారు. వాళ్లు పరిశీలించిన తర్వాత గాయం తీవ్ర తరమని నిర్ధారిస్తే, కంకషన్ సబ్‌స్టిట్యూట్ అమల్లోకి వస్తుంది. కంకషన్ గాయానికి గురైన ప్లేయర్ ఆడలేని పరిస్థితులు ఉంటే సబ్‌స్టిట్యూట్ గా మరొకరిని తుది జట్టులోకి తీసుకుంటారు. 2019 జూలై నుంచి ఈ రూల్ తీసుకువచ్చింది ఐసీసీ. సబ్‌స్టిట్యూట్ ఆటగాన్ని మ్యాచ్ రిఫరీ ఆమోదించాల్సి ఉంటుంది. బ్యాటర్ అయితే బ్యాటర్ ను… ఫాస్ట్ బౌలర్ అయితే బౌలర్నే దింపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆకాశ్ దీప్ కు ఎదురైన పరిస్థితి కూడా ఇదే. అతడు పేసర్ కాబట్టి మరో పేసర్ ప్రసిద్ కృష్ణను బరిలోకి దింపారు.