E-Paper
Advertisement

అమరావతి కంటే నారోలోకేష్ స్పీడ్‌గా మారుతుండు.. అంబటి సెటైర్లు?

అమరావతి కంటే నారోలోకేష్ స్పీడ్‌గా మారుతుండు.. అంబటి సెటైర్లు?
Advertisement

Ambati Rambabu: సీఎం చంద్రబాబు ఎకనామిక్స్‌లో తాను ప్రొఫెసర్‌నని అనేకసార్లు చెప్పారని, 2014లో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అంబటి రాంబాబు అన్నారు. ఆ తర్వాత హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రిగా ఓటమి మూటగట్టుకున్నారు. దోపిడీ శాస్త్రంలో మాత్రం ఆయన డబుల్ పీహెచ్డీ చేశారని ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిధులతో రాష్ట్రం నిర్మిస్తుందని ఒప్పించారని ఆ ప్రాజెక్టును ఏటీఎం లా మార్చుకున్నారని గతంలో ప్రధాని మోదీ కూడా విమర్శించారని గుర్తు చేశారు.

ప్రజలపై భారమే..

రాష్ట్రానికి గ్రీన్ ఫీల్డ్ రాజధాని అమరావతి కడుతున్నామని దోపిడి చేస్తున్నారు. గతంలో అమరావతి నిర్మాణం కోసం 2271 అంచనా వ్యయాన్ని 4830 కోట్లు పెంచి టెండర్లు పిలిచారు. దాన్ని మళ్ళీ 15,313 వరకు కోట్లకు పెంచారని, వేలకోట్ల వివిధ సంస్థల నుంచి తెచ్చి తనవాళ్లకు దోచిపెడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. రాజధానిలో ఖర్చు పెడుతున్న ప్రతీ రూపాయి బాధ్యత ప్రజలకే భారం పడుతుందని, రెండు లక్షల ఖర్చుపెట్టి రాజధాని నిర్మిస్తామని చెప్పటం పరాకాష్ట అని విమర్షించారు.

Advertisement

Also Read:  కైలాసగిరి కొండపై స్కూల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 37 మంది విద్యార్థులు!

అంబటి ఫైర్..

రుషికొండ భవనాన్ని ప్రజల సందర్శనార్థం పెడుతున్నాం అంటున్నారు. కేంద్రం అనుమతితో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను జగన్ నివాసం అన్నారు. విలాసవంతమైన భవనం కట్టారు అనే జగన్‌ను విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. రెండున్నరేళ్ల పాటు దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. అలాంటి భవనాలను సద్వినియోగం చేసుకోవటం చేతకాక బురదచల్లే పనిలో ఉన్నారని అంబటి ఫైర్ అయ్యారు. క్వాలిటీ లేకుండా అమరావతి నిర్మాణాలు చేస్తూ రుషికొండ భవనాలను విమర్శిస్తున్నారని అన్నారు.

ఇచ్చిన మాట వాస్తవమే..

Advertisement

డీ లిమిటేషన్‌కు గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాట వాస్తవమే.. అప్పుడు బిల్లు ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి కేంద్రం బిల్లు పెట్టబోతుంది. మాపార్టీ అధినేత వైఎస్ జగన్ అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. మాపార్టీ వైఖరి అతిత్వరలో ప్రకటిస్తాంమని, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం కట్టారని కూటమి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా పార్టీకి 50 శాతం ఓట్లు సాధించిందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి దుర్మార్గాలు చూడలేదు. అందరూ కుమ్మక్కై ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మావైపే ఉన్నారని అన్నారు. ప్రతీ 100 రోజులకు అమరావతి సంగతి ఏమో కానీ లోకేష్ రూపురేఖలు మారుతున్నాయని, అమరావతి మొత్తం తనయుడి దోపిడీ చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్‌గా పరిచయం.. టెకీకి రూ. 10.05 లక్షల టోకరా!

Tags

Related News

కైలాసగిరి కొండపై స్కూల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 37 మంది విద్యార్థులు!

‘మరి పరిష్కారం ఏంటి?’.. డీలిమిటేషన్ వివాదంపై కాంగ్రెస్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న!

నాడు అలా.. నేడు ఇలా! అమరావతి నిర్మాణ వేగంపై లోకేశ్‌ పవర్‌ఫుల్ వీడియో!

తిరుమల విజిలెన్స్ అదుర్స్.. పోయిన 60 గ్రాముల బంగారం రికవరీ.. గంటల వ్యవధిలో భక్తుడికి అప్పగింత!

మన్యం జిల్లాల విషాదం.. రైలు కింద పడి ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య!

లోక్‌సభ సీట్ల పెంపునకు చంద్రబాబు మద్దతు.. దక్షిణాదికి అన్యాయం జరగొద్దని విజ్ఞప్తి

రుషికొండ ప్యాలెస్‌లోకి ప్రజలకు ఎంట్రీ.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×