E-Paper
Advertisement

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా..?

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా..?
Advertisement

Pothole Complaints: ఏపీ ప్రభుత్వం మరో సంచలన కీలక నిర్ణయం తీసకుంది. ఇక వివరాల్లోకి వెలితే.. గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఎక్కడైన రోడ్డు మీద గుంత క‌నిపిస్తే మ‌న‌మిత్ర ద్వారా ఫిర్యాదు చేసే స‌దుపాయంను ప్రభుత్వం కల్పించింది. రోడ్డు మీద గుంత క‌నిపిస్తే దాన్ని మ‌న‌మిత్రకు షేర్ చేయాల‌ని కూటమి ప్ర‌భుత్వం తెలిపింది. గుంత‌లు ర‌హిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న దిశ‌గా ప్ర‌భుత్వం కీల‌క అడుగులు వేస్తుంది.

మ‌న‌మిత్ర యాప్ ద్వారా..

మ‌న‌మిత్ర ద్వారా ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేసే ప్ర‌య‌త్నంను కూటమి ప్రభుత్వం చేస్తుంది. పౌరులు త‌మ ప్రాంతంలోని రోడ్ల‌పై గుంత‌లు క‌నిపిస్తే మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నెంబ‌రు 9552300009కు పంపాల‌ని ప్రభుత్వం కోరింది. ఈ మేర‌కు మ‌న‌మిత్ర‌లో ప్ర‌త్యేక స‌దుపాయంను రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ కల్పించింది. ఎవరైనా కంప్లెట్ చేయాలంటే మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నంబ‌రు 9552300009కు హాయ్ అని మెసేజ్ పంపాలని, అందులో సేవ‌ల అప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. యాప్‌లో పాట్‌హోల్ గ్రీవెన్సెస్ (Pothole Grievances) ఆప్ష‌న్ ఎంపిక చేసుకోని దానిలో.. రిజిస్ట‌ర్ పాట్‌హోల్ గ్రీవెన్స్ (Register Pothole Grievance) ఎంపిక చేసుకోవాలని తెలిపారు.

క‌రెంటు లొకేష‌న్ షేర్..

Advertisement

యాప్‌లో ప్లీజ్ ఫిల్ ది ఫామ్ ఆఫ్ పాట్‌హోల్ గ్రీవెన్స్ టు స‌బ్‌మిట్ యువ‌ర్ కంప్లైంట్ అని వ‌స్తుంది. దాన్ని ఓపెన్ చేయాలి. ఆధార్ వెరిఫికేష‌న్ కోసం మీ ఆధార్ నెంబ‌రు చేసి మీకు వ‌చ్చే ఓటీపీ న‌మోదు చేయాలి. అనంతరం మీ ప్రాంతంలో రోడ్డుమీద ఉన్న గుంత ఫొటో తీసి అప్‌లోడు చేయాలి. ఆ గుంత ఉన్న ప్రాంతం క‌రెంటు లొకేష‌న్ షేర్ చేస్తే చాలు మీరు పంపిన ఫొటోతో కూడిన స‌మ‌స్య‌పై గ్రీవెన్స్ న‌మోదైన‌ట్లు మీకు స‌మాచారం వ‌స్తుంది. దీంతో అది వెంట‌నే సంబంధిత శాఖ‌కు వెళుతుంది. దానిపై ఆ శాఖ స్పందించి ఆ గుంత‌లు పూడ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటారని కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గుంత‌ల ర‌హిత ర‌హ‌దారులున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాధించాల‌నే దిశ‌గా ప్ర‌భుత్వం కృషి చేస్తుందని ఈ బృహ‌త్కార్యంలో ప్ర‌జ‌లంతా భాగ‌స్వాములు కావాల‌ని ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది.

Also read: సరిగమప షోకి వెళ్లడం వెనుక అసలు కారణం చెప్పేసిన అనిల్ రావిపూడి!

Tags

Related News

అమరావతి భవనాల వ్యయంపై.. వైఎస్ జగన్ సంచలన పోస్ట్!

ఏపీకి మరో బంపర్ ఆఫర్.. రామాయపట్నంలో రూ.1.27 లక్షల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ.. లోకేష్ ఏమన్నారంటే?

అమరావతి కంటే నారోలోకేష్ స్పీడ్‌గా మారుతుండు.. అంబటి సెటైర్లు?

వైజాక్ కైలాసగిరి కొండపై స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే?

‘మరి పరిష్కారం ఏంటి?’.. డీలిమిటేషన్ వివాదంపై కాంగ్రెస్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న!

నాడు అలా.. నేడు ఇలా! అమరావతి నిర్మాణ వేగంపై లోకేశ్‌ పవర్‌ఫుల్ వీడియో!

తిరుమల విజిలెన్స్ అదుర్స్.. పోయిన 60 గ్రాముల బంగారం రికవరీ.. గంటల వ్యవధిలో భక్తుడికి అప్పగింత!

Big Stories

Advertisement
×