E-Paper
Advertisement

కారుని ఢీ కొట్టిన లారీ, స్పాట్‌లో నలుగురు మృతి, ప్రకాశం జిల్లా టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం

కారుని ఢీ కొట్టిన లారీ, స్పాట్‌లో నలుగురు మృతి, ప్రకాశం జిల్లా టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం
Advertisement

Prakasam district Accident: పదే పదే పోలీసులు చెప్పినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు వాహనదారులు. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. టోల్ గేట్ వద్ద ఫీజు చెల్లిస్తున్న కారుని వెనుక నుంచి వస్తున్న ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉదయం జరిగింది.

ప్రకాశం జిల్లా టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం

ప్రకాశం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఫీజు చెల్లిస్తున్న కారుని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కంటైనర్ లారీ బలంగా ఢీ కొట్టింది. స్పాటులో నలుగురు మృతి చెందారు. మరొక బాలుడు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల మేరకు.. స్థానిక ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అద్దంకి మండలం చెరుకుంపాలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లాలోని సొంత గ్రామానికి పయనమయ్యారు.

కారుని వేగంగా వచ్చి ఢీ కొట్టిన లారీ

Advertisement

కొద్దిసేపట్లో వారంతా సొంతూరు చేరుకోవాల్సి ఉంది. టంగుటూరు టోల్‌ప్లాజా వద్దకు రాగానే పన్ను చెల్లించేందుకు ప్లాజా వద్ద వెయిట్ చేస్తోంది.  ట్రావెల్స్‌ బస్సు వెనుక కారు ఆగి వుంది. అదే క్రమంలో వేగంగా దూసుకు వచ్చింది ఓ లారీ. కారుని బలంగా ఢీ కొట్టడంతో రెండు వాహనాల మధ్య కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సాయికుమార్, కామేశ్వరమ్మ, జాగర్లముడి శ్రీనివాసరావుతో ముగ్గురు అక్కడికికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన జాగర్లమూడి శివ పార్వతిని ఒంగోలు రిమ్స్‌కు తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. కారులో ఓ బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరకున్నారు. హైవే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది కారులోని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

ALSO READ: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా..?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా..?

అమరావతి భవనాల వ్యయంపై.. వైఎస్ జగన్ సంచలన పోస్ట్!

ఏపీకి మరో బంపర్ ఆఫర్.. రామాయపట్నంలో రూ.1.27 లక్షల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ.. లోకేష్ ఏమన్నారంటే?

అమరావతి కంటే నారోలోకేష్ స్పీడ్‌గా మారుతుండు.. అంబటి సెటైర్లు?

వైజాగ్ కైలాసగిరి కొండపై స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే?

‘మరి పరిష్కారం ఏంటి?’.. డీలిమిటేషన్ వివాదంపై కాంగ్రెస్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న!

నాడు అలా.. నేడు ఇలా! అమరావతి నిర్మాణ వేగంపై లోకేశ్‌ పవర్‌ఫుల్ వీడియో!

Big Stories

Advertisement
×