E-Paper
Advertisement

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో హింస.. టీడీపీ-వైసీపీ వర్గాల భీకర దాడులు! పలువురు పరిస్థితి విషమం

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో హింస.. టీడీపీ-వైసీపీ వర్గాల భీకర దాడులు! పలువురు పరిస్థితి విషమం
Advertisement

AP Elections Violence: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగింది. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. అందులో పలువురి పరిస్థితి విషమంగా మారింది. అటు ప్రకాశం జిల్లాలోని ఓ ప్రాంతంలో బ్యాలెట్ బ్యాక్సుల్లో ఇంకు పోశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో అక్కడ పోలింగ్ ఆగిపోయాయి.

ఏపీలోని రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో హింస

పగలు, ప్రతీకారాలకు కేరాఫ్ గ్రామీణ ప్రాంతాలు. ఆ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు అంటే చెప్పాల్సిన పని లేదు. ఖచ్చితంగా హింస చెలరేగుతుంది, అదే జరిగింది. తాజాగా అనంతపురం జిల్లా యల్లనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక జడ్పీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య భీకర దాడులు జరిగాయి.

Advertisement

పోలింగ్‌ కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో దాదాపు డజను మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉంది.

టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య దాడులు, పలువురు పరిస్థితి విషమం

కడప జిల్లా రెండోదశ పంచాయితీ ఎన్నికల్లో హింస మొదలైంది. ఉదయం నుంచి గొడవలు మొదలయ్యాయి. వీరపనాయన పల్లె మండలం పాయసంపల్లిలో పోలింగ్ ప్రారంభానికి ముందే ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. బయటి వ్యక్తులు గ్రామంలోకి రావడంపై ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాయి. కడప జిల్లా వేంపల్లిలో హైటెన్షన్ నెలకొంది.

Advertisement

పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్ల ఆందోళనకు దిగారు. ఓటు వేసేందుకు అనుమతించడం లేదని మహిళల ధర్నా చేశారు. తమను ఇరుపార్టీల కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ లాక్కున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగం బొట్లపాలెంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణలు జరిగాయి. టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు కొందరు బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోశారు.

పోలీసుల ఏకపక్ష వైఖరిపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసే వారికి రక్షణ కల్పిస్తున్నారా అంటూ జిల్లా ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మూకలు బయటి ప్రాంతాల నుండి వచ్చి పోలింగ్ బూతుల వద్ద ఏజెంట్లను బయటకు పంపుతూ ఓటర్ల స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ స్వేచ్ఛాయుత ఓటింగ్ కోసం ఎస్పీ-ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ALSO READ: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఈసారి పైచేయి ఎవరిది? కూటమి గెయిన్ అవుతుందా?

 

 

 

Related News

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఈసారి పైచేయి ఎవరిది? కూటమి గెయిన్ అవుతుందా?

కారుని ఢీ కొట్టిన లారీ, స్పాట్‌లో నలుగురు మృతి, ప్రకాశం జిల్లా టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా..?

అమరావతి భవనాల వ్యయంపై.. వైఎస్ జగన్ సంచలన పోస్ట్!

ఏపీకి మరో బంపర్ ఆఫర్.. రామాయపట్నంలో రూ.1.27 లక్షల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ.. లోకేష్ ఏమన్నారంటే?

అమరావతి కంటే నారోలోకేష్ స్పీడ్‌గా మారుతుండు.. అంబటి సెటైర్లు?

వైజాగ్ కైలాసగిరి కొండపై స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×