E-Paper
Advertisement

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఈసారి పైచేయి ఎవరిది? కూటమి గెయిన్ అవుతుందా?

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఈసారి పైచేయి ఎవరిది? కూటమి గెయిన్ అవుతుందా?
Advertisement

Panchayat Elections in AP: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం ఆరు గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ మొదలుకానుంది. ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు? కూటమి మద్దతుదారులు గెయిన్ అవుతారా? వైసీపీ తన హవా కంటిన్యూ చేస్తుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఏపీలో రెండో విడత పంచాయతీల ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఒంటి గంట వరకు సమయం ఉండడంతో ఆరుగంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. రెండో విడతలో 3880 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడత ఎన్నిక కోసం 37 వేలకు పైగానే పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Advertisement

సుమారు 83,52,338 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ప్రక్రియ తాపీగా ర్వహించేందుకు సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షించనున్నారు అధికారులు. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో అధికంగా 342 పంచాయతీలు ఉన్నాయి. ఇక అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 54 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ విడత పైచేయి ఎవరిది?

శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 342 పంచాయతీల్లో, పల్నాడు జిల్లాలో అత్యల్పంగా 54 పంచాయతీల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ విడతలో 1095 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ విడతలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేవలం విశాఖ మినహా మిగతా 28 జిల్లాల్లో ఈ విడత పోలింగ్ జరుగుతోంది.

Advertisement

ఈసారి కూటమి జోరు కొనసాగుతోందా? లేకుండా మునపటి ఫామ్‌ని వైసీపీ కంటిన్యూ చేస్తుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడు తున్నాయి. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీకి ఆపోజిట్‌గా జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో  వైసీపీ మద్దతుదారులు గెలుపు ఈజీ అవుతోంది. ఈసారి విడత ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

ALSO READ: కారుని ఢీ కొట్టిన లారీ, స్పాట్‌లో నలుగురు మృతి, ప్రకాశం జిల్లా టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం

Related News

కారుని ఢీ కొట్టిన లారీ, స్పాట్‌లో నలుగురు మృతి, ప్రకాశం జిల్లా టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా..?

అమరావతి భవనాల వ్యయంపై.. వైఎస్ జగన్ సంచలన పోస్ట్!

ఏపీకి మరో బంపర్ ఆఫర్.. రామాయపట్నంలో రూ.1.27 లక్షల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ.. లోకేష్ ఏమన్నారంటే?

అమరావతి కంటే నారోలోకేష్ స్పీడ్‌గా మారుతుండు.. అంబటి సెటైర్లు?

వైజాగ్ కైలాసగిరి కొండపై స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే?

‘మరి పరిష్కారం ఏంటి?’.. డీలిమిటేషన్ వివాదంపై కాంగ్రెస్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న!

Big Stories

Advertisement
×