E-Paper
Advertisement

Janasena Pending Seats : పెండింగ్ స్థానాలపై జనసేనాని ఫోకస్.. అక్కడ అభ్యర్థులెవరో ?

Janasena Pending Seats : పెండింగ్ స్థానాలపై జనసేనాని ఫోకస్.. అక్కడ అభ్యర్థులెవరో ?
Advertisement

Machilipatnam Janasena MP Candidate : పెండింగ్ లో ఉన్న మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిని ప్రకటించింది. వల్లభనేని బాలశౌరి పేరును జనసేనాని పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించినట్లు.. పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని నిర్ణయించాల్సి ఉంది. ఇక విజయవాడ వెస్ట్ సీటు కూడా పెండింగ్ లో ఉంది. పెండింగ్ స్థానాలపై ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్ త్వరలోనే ఆయా స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

Advertisement

Also Read : మాటల వార్.. పిఠాపురంలో హీట్.. గీత ఆరు కోట్లు మింగేశారు?

నేటి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత తొలిసారి ఆయన పిఠాపురం రానున్నారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కాకుండా.. ఆయన టూర్ లో స్వల్ప మార్పులు జరిగాయి. పవన్ గొల్లప్రోలులో హెలికాప్టర్‌లో దిగి నేరుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్లనున్నారు. అక్కడే భోజనం చేయనున్నారు. తర్వాత పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించనున్నారు. వారాహి వాహనానికి జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజల అనంతరం శ్రీపాద, శ్రీ వల్లభ దత్తాత్రేయుడిని పవన్ దర్శించుకోనున్నారు.

Advertisement

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×