E-Paper
Advertisement

Sundeep Kishan: మరొక హిట్ కోసం సందీప్ కిషన్.. కొత్త సినిమా షురూ చేసేశాడుగా..

Sundeep Kishan: మరొక హిట్ కోసం సందీప్ కిషన్.. కొత్త సినిమా షురూ చేసేశాడుగా..
Advertisement
Sundeep Kishan
Sundeep Kishan

Sundeep Kishan: హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు తీస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. డిఫరెంట్ కాన్సెప్ట్‌లే లక్ష్యంగా సినిమా సినిమాకు కథలను మార్చేస్తున్నాడు. ఇటీవలే ఒక డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

సందీప్ కిషన్ ఇటీవల నటించిన కొత్త చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, కావ్యాథాపర్ హీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

కలెక్షన్లలో కూడా ఈ మూవీ తన హవా చూపించింది. తొలిరోజు ఏకంగా రూ.6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అబ్బురపరచింది. ఇక థియేటర్ అనంతరం ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. అయితే అక్కడ కూడా ఈ మూవీ సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో అదరగొట్టేసింది.

Also Read: ‘ఓ భామ అయ్యో రామ’ అంటున్న సుహాస్.. కొత్త సినిమా పోస్టర్ అదిరిపోయిందిగా

Advertisement

ఇక ఇదే జోష్‌లో సందీప్ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇవాళ తన కొత్త సినిమాను మేకర్స్ ప్రకటించారు. సందీప్ కిషన్ హీరోగా ‘వైబ్’ టైటిల్‌తో రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

అందులో సందీప్‌తో పాటు మరో నలుగురు తన వెనుక హాకీ స్టిక్స్, బ్యాట్ వంటి ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. సందీప్ మాత్రం ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో గాజు సీసా పట్టుకుని చాలా కోపంగా మొహంపై దెబ్బలతో కనిపిస్తున్నాడు.

దీనిబట్టి చూస్తే ఈ మూవీ మాస్ యాక్షన్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకత్వం వహిస్తుండగా.. రాహుల్ యాదవ్ నక్క ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2025 సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×