E-Paper
Advertisement

JD Laxmi Narayana : ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం..

JD Laxmi Narayana : ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం..
Advertisement

JD Laxmi Narayana : కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ‘జై భారత్‌ నేషనల్‌’ పేరుతో ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అన్ని వర్గాల ప్రజలను కలిసిన తర్వాతే పార్టీ పెట్టినట్లు ఆయన వెల్లడించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీ పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాజకీయ పార్టీ పెట్టాలని లక్ష్మీనారాయణ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే.. ప్రజల్లో అవగాహన వచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా అర్ధరాత్రి ఆలోచన చేద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, మేధావులతో చర్చలు జరిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే ప్రకటన చేశారు. కాగా 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×