BigTV English

Bajrang Punia : బజ్‌రంగ్‌ పూనియా సంచలన నిర్ణయం.. ఆ అవార్డు వెనక్కి!

Bajrang Punia : బజ్‌రంగ్‌ పూనియా సంచలన నిర్ణయం..  ఆ అవార్డు వెనక్కి!

Bajrang Punia : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్‌ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు.. సంజయ్ సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో రెజ్లరర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఎన్నికతో రెజ్లర్ సాక్షి మాలిక్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా మరో రెజ్లర్ బజరంగ్ పూనియా తనకు వచ్చిన పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు.


ఈ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రెజ్లర్‌ సాక్షి మలిక్‌ ఇప్పటికే రెజ్లింగ్‌కు కన్నీటితో రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా మరో రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు వచ్చిన పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశాడు.

బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పి..ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో తాము మళ్లీ రోడెక్కాల్సి వచ్చిందన్నారు. న్యాయ కోసం మా పతకాలను గంగా నదిలో కలిపేద్దామనుకున్నప్పుడు..బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.. కానీ తాజాగా డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో రెజ్లింగ్‌ సమాఖ్య మళ్లీ బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకి వెళ్లిందని లేఖలో వాపోయారు బజరంగ్ పూనియా. ఈ కారణంగానే..పద్మశ్రీ అవార్ట్‌ను వెనక్కి ఇస్తున్నట్లు తెలిపాడు. సంజయ్‌ సింగ్‌ ప్రస్తుతం డబ్ల్యూఎఫ్‌ఐకి అధ్యక్షుడు కావడంతో ఈ వేధింపులు ఇలాగే కొనసాగుతాయని రెజ్లర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Related News

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Big Stories

×