BigTV English

Ahmedabad Flight Crash : రూ.100 కోట్ల పరిహారం.. కేఏ పాల్ సంచలనం

Ahmedabad Flight Crash : రూ.100 కోట్ల పరిహారం.. కేఏ పాల్ సంచలనం

Ahmedabad Flight Crash : విమానం కూలింది. 241 మంది చనిపోయారు. ఒకే ఒక్కడు బతికాడు. ఎయిర్ఇండియా కోటి పరిహారం ప్రకటించింది. ప్రధాని మోదీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఫ్లయిట్ క్రాష్‌కు కారణం ఇంకా తెలియరాలేదు. DGCA విచారణ కొనసాగుతోంది. ఇంధనంకు మంటలు అంటుకోవడంతో దాదాపు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. దాదాపు అణుబాంబు తీవ్రతతో సమానమైన పేలుడు కారణంగా ప్రయాణికులు గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. విమానం కూడా ఆనవాళ్లు లేకుండా పూర్తిగా ధ్వంసమైంది. కానీ, విమానంలోని ఓ ప్రయాణికుడి దగ్గర ఉన్న భగవద్గీత మాత్రం ఒక్క పేజీ కూడా కాలిపోలేదు. భగవద్గీతకు ఏమీ కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు, ఘటనా స్థలం నుంచి బ్లాక్‌బాక్స్, డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ టీమ్ సేకరించింది. ప్రమాదానికి కారణం ఏమిటన్నది అప్పుడే చెప్పలేమంటున్నారు నిపుణులు. ఇదంతా పక్కనపెడితే.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తనదైన స్టైల్‌లో స్పందించారు.


రూ.100 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే..

తాను అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉండే కానీ కాన్సిల్ చేసుకున్నానని చెప్పారు కేఏ పాల్. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, కేంద్రమంత్రి రామ్ మోహన్ నాయుడు రాజీనామా చేయాలన్నారు. ఏవియెషన్‌పై రామ్ మోహన్ నాయుడుకు ఏబీసీడీలు కూడా తెలియవన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.100 కోట్లు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు పాల్.


మోదీ, అదానీలు అలా చేసుంటే..

ఇది టెర్రరిస్ట్ దాడా? శత్రువులు చేసిన అటాకా? గుర్తించాలని.. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కేఏ పాల్ అన్నారు. అహ్మదాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌ను అదానీ కంపెనీయే నిర్వహిస్తోందని చెప్పారు. ఆ రన్ వే 13 వేల అడుగులు కూడా లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. రన్ వే పెంచమని అదానీకి మోదీ ఎందుకు చెప్పలేదని అడిగారు. ఈ ప్రమాదం ఇండియన్ ఎకానమీ, టూరిజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పాల్ అభిప్రాయపడ్డారు.

మోదీ రాజీనామా చేయాల్సిందే..

సెప్టెంబర్ నెలలో ప్రధాని మోడీకి 75 ఏళ్లు పూర్తి అవుతున్నాయి కాబట్టి బీజేపీ నిబంధనల ప్రకారం కూడా మోడీ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు కేఏ పాల్. అమిత్ షా కు కానీ, వేరే ఎవరైనా యంగ్ లీడర్ ను కానీ ప్రధానమంత్రిని చేయాలని సూచించారు.

ఇజ్రాయిల్ ప్రధానికి పాల్ ఫోన్

మరోవైపు, ఇరాన్, ఇజ్రాయిల్ వార్ పైనా స్పందించారు పాల్. ఇరాన్‌పై ఇజ్రాయిల్ చేసిన దాడి మూడవ ప్రపంచ యుద్దానికి కారణం అవుతుందని అన్నారు. తాను ఫోన్ చేసినా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించలేదని చెప్పారు. ఆయన పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్నాడని.. వెంటనే యుద్ధం ఆపి.. శాంతి చర్చలు ఆపాలని పిలుపు ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×