Prabhas: అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాద (Plane Crash)ఘటన అందరి హృదయాలను ఎంతగానో కలిసివేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని క్షణాలకే కూలిపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ నుంచి 15 కిలోమీటర్ల దూరం కూడా వెళ్లకుండానే ఒక మెడికల్ హాస్టల్ పై విమానం కూలిపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ ప్రమాదం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. విమానంలో ప్రయాణిస్తున్న వారు మాత్రమే కాకుండా మెడికల్ హాస్టల్లో భోజనం చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా దాదాపు 20 మంది వరకు మరణించారు.
విమాన ప్రమాదం…
ఇలా ఈ విమాన ప్రమాదఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలు చూస్తే అక్కడ పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందో స్పష్టమవుతుంది. ఇలా ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకోవడంతో వెంటనే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ,క్రికెట్ రంగానికి చెందిన వారందరూ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ సంతాపం ప్రకటించారు.
స్పందించిన టాలీవుడ్…
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా సంతాపం తెలియజేశారు. అయితే ప్రభాస్ (Prabhas)కూడా ఈ విమాన ప్రమాద ఘటనపై స్పందించారు. దీంతో ఈయనపై భారీ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. అసలు ప్రభాస్ పై విమర్శలు రావడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే ఈ ఘటన నిన్న మధ్యాహ్న సమయంలో చోటు చేసుకుంటే ప్రభాస్ మాత్రం తాజాగా ఈ ఘటనపై పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఈయన పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ చేసిన ఈ పోస్టు పట్ల కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ.. రాజుగారికి ఈ ఘటనపై స్పందించడానికి ఇప్పటికీ తీరిక దొరికిందా అంటూ విమర్శలు చేయగా, మరికొందరు అసలు నువ్వు ఈ భూమి మీదనే ఉన్నావా ప్రభాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ పై విమర్శలు..
ఈ ఘటన జరిగి దాదాపు 24 గంటల పైన అవుతుంది. ఇప్పుడు ఈ ఘటనపై పోస్ట్ పెట్టడం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ప్రభాస్ ఈ విషయంలోనే కాదు గతంలో పహల్గాం దాడి జరిగిన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇలా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సమయంలో కూడా ఎంతోమంది సెలబ్రిటీలు వెంటనే స్పందిస్తూ పూర్తిస్థాయిలో వారి మద్దతును ప్రకటించారు కానీ ప్రభాస్ మాత్రం నాలుగు రోజుల తర్వాత ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఘటన గురించి స్పందించడంతో ఈయన పట్ల విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇలాంటి విషయాల పట్ల వెంటనే స్పందించకపోవడంతో ఈయనపై ఇలాంటి విమర్శలు వస్తున్నాయని చెప్పాలి. ఇక కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ 5 పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో ఈయన బిజీగా ఉన్నారు.