E-Paper
Advertisement

Madanapalle Girl Incident: మదనపల్లిలో చిన్నారి ఘటన కేసు.. నిందితుడు మృతి, చెరువులో మృతదేహం!

Madanapalle Girl Incident: మదనపల్లిలో చిన్నారి ఘటన కేసు.. నిందితుడు మృతి, చెరువులో మృతదేహం!
Advertisement

Madanapalle Girl Incident: మదనపల్లిలో చిన్నారి ఘటన కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు కులవర్థన్ మృతి చెందాడు. కనసానివారిపల్లె చెరువులో మృతదేహం లభ్యమైంది. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కులవర్థన్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు.

కొత్త మలుపు తిరిగిన మదనపల్లిలో చిన్నారి ఘటన కేసు

Advertisement

మదనపల్లి చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో కీలక నిందితుడు కులవర్థన్. జరిగిన ఘటనపై ఆందోళనలు తీవ్రం కావడంతో నిందితుడు భయపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా కురబల కోట మండలంలోని కనసానివారిపల్లె చెరువులో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. మృతుడు కులవర్థన్ అని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలియగానే స్పాట్‌కు చేరుకున్నారు ముదివేడు పోలీసులు. కులవర్థన్ మృతదేహమేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

సోమవారం సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చిన్నారి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. ఆ తర్వాత  చిన్నారి తల్లిదండ్రులు, తాతను విచారించారు. కులవర్థన్ పేరు చెప్పడంతో అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో కులవర్ధన్ ఇంటికి పోలీసులు వచ్చారు.

Advertisement

నిందితుడు కులవర్థన్ మృతి, చెరువులో మృతదేహం!

నిందితుడి ఇంట్లో చిన్నారి మృతదేహం ప్లాస్టిక్ డ్రమ్ములో గుర్తించారు పోలీసులు. అదే సమయంలో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు కులవర్దన్. మంగళవారం రోజంతా మదనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పారిపోయిన కులవర్ధన్ కోసం గాలింపు చేపట్టారు.

బుధవారం ఉదయం మదనపల్లి శివారులోని కనసానివారిపల్లె చెరువులో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కులవర్థన్ మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: మదనపల్లి బాలిక ఘటన.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం

 

Related News

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Big Stories

Advertisement
×