BigTV English

OTT Movie : లవ్ ప్రపోజల్ ఒప్పుకోలేదని అక్క పైనే అఘాయిత్యం… క్లైమాక్స్ ట్విస్ట్ కి క్లాప్స్ కొట్టాల్సిందే

OTT Movie : లవ్ ప్రపోజల్ ఒప్పుకోలేదని అక్క పైనే అఘాయిత్యం… క్లైమాక్స్ ట్విస్ట్ కి క్లాప్స్ కొట్టాల్సిందే

OTT Movie : ఓటీటీలో సంజయ్ దత్ నటించిన ఒక యాక్షన్ రివేంజ్ మూవీ ఇప్పటికీ మంచి వ్యూస్ తో నడుస్తోంది. ఈ సినిమా ఒక తండ్రి, కూతుళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ జీవితంలో జరిగే ఒక దారుణమైన సంఘటనతో స్టోరీ మలుపు తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


యూట్యూబ్ (Youtube) లో

ఈ బాలీవుడ్ రివేంజ్ యాక్షన్ మూవీ పేరు ‘భూమి’ (Bhoomi). 2017 లో వచ్చిన ఈ సినిమాకి ఓముంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సంజయ్ దత్ (అరుణ్ సచ్దేవ), అదితి రావు హైదరి (భూమి సచ్దేవ), శరద్ కేల్కర్ (ధౌలి), సిద్ధాంత్ గుప్తా (నీరజ్), శేఖర్ సుమన్ (తాజ్ మిశ్రా), పూరు చిబ్బర్ (విశాల్) ప్రధాన పాత్రలలో నటించారు. 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 5.2/10 రేటింగ్ ఉంది. యూట్యూబ్ (Youtube) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

అరుణ్ సచ్దేవ (సంజయ్ దత్) ఒక చెప్పుల షాప్ ను నడుపుతుంటాడు. తన ఏకైక కుమార్తె భూమి సచ్దేవ (అదితి రావు హైదరి)తో జీవిస్తుంటాడు. అరుణ్, భూమి మధ్య గాఢమైన తండ్రీ-కూతురి బంధం ఉంటుంది. భూమి తన బాల్య స్నేహితుడు నీరజ్ (సిద్ధాంత్ గుప్తా)ను ప్రేమిస్తుంటుంది. ఇప్పుడు వీళ్ళ వివాహానికి సన్నాహాలు జరుగుతుంటాయి. అరుణ్ కూడా తన కుమార్తె సంతోషాన్ని చూసి ఆనందంగా ఉంటాడు. అయితే అదే ఊరిలో ఉండే విశాల్ (పూరు చిబ్బర్), భూమిపై మోహంతో ఉంటాడు. భూమి అతని ప్రేమను ఒప్పుకోకపోవడంతో, విశాల్ తన బంధువు ధౌలి అనే ఒక క్రూరమైన స్థానిక గ్యాంగ్‌స్టర్, ధేడా అనే మరో గుండాతో కలిసి ఒక దారుణమైన పథకం రూపొందిస్తాడు. వివాహానికి ఒక రోజు ముందు భూమిని కిడ్నాప్ చేసి, భగవాన్ టాకీస్ అనే సినిమా హాల్‌లో ఆమెపై వీళ్ళంతా అఘాయిత్యం చేస్తారు. వీరిలో అన్న వరస అయ్యే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. ఈ దారుణ సంఘటన భూమి, అరుణ్ జీవితాలను తలకిందులు చేస్తుంది. నీరజ్ సమాజ ఒత్తిడి వల్ల, భూమిని వివాహం చేసుకోలేక పోతాడు.

అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కానీ ధౌలి రాజకీయ ప్రభావంతో పోలీసులు ఈ కేసును తేలిగ్గా తీసుకుంటారు. మరో వైపు భూమి ఈ దాడి తర్వాత మానసికంగా కుంగిపోతుంది. కోర్టు విచారణలో అవమానాలు ఎదుర్కొంటుంది. అరుణ్ తన కుమార్తెకు న్యాయం చేయడానికి, చట్టపరమైన మార్గాలను వెతుకుతాడు. కానీ నిరాశతో నిండిపోతాడు. ఈ సమయంలో భూమి మరోసారి కిడ్నాప్‌కు గురవుతుంది, రేపిస్టులు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె బతికి బయటపడుతుంది. ఆ తరువాత కోర్టులో, నేరస్తులు నిర్దోషులుగా విడుదలవుతారు. ఇప్పుడు భూమి తన బాధ నుండి బయటపడి, ధైర్యవంతమైన మహిళగా మారుతుంది. తన తండ్రితో కలిసి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక హింసాత్మక మార్గం ఎంచుకుంటుంది. చివరికి భూమి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా ? ఆ రౌడీలను ఎలా ఎదుర్కుంటుంది ? తండ్రి ఆమె రెవేంజ్ లో ఎలాంటి పాత్ర పోషిస్తాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : డేంజర్ అని ఉన్న దారిలోనే బాయ్ ఫ్రెండ్ తో ప్రయాణం… కేక పెట్టించే హర్రర్ థ్రిల్లర్

Related News

OTT Movie : ఇంత కరువులో ఉన్నారేంది సామీ… మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : 30 ఏళ్ల క్రితం మూసేసిన రోడ్… అక్కడ అడుగు పెడితే నరకానికే… ఐఎండీబీలో 8.1 రేటింగ్

OTT Movie: వీళ్లేం మనుషులురా బాబు? అంత్యక్రియల్లో పొట్టచక్కలయ్యే కామెడీ, ఈ మలయాళ మూవీ అస్సలు మిస్ కావద్దు

OTT Movie : స్కూల్ కెళ్లే అమ్మాయితో పాడు పని… ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని తెలిశాక వాడికి ఉంటది… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : ఇది సినిమానా, చికెన్ షాపా మావా? ఒక్కో పార్ట్ కట్ చేసి ఏందా అరాచకం… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

Big Stories

×