E-Paper
Advertisement

సోనీ నుంచి కొత్త 5G ఫోన్.. 120Hz OLED డిస్‌ప్లే, 50MP కెమెరా.. ధర ఎంతంటే?

సోనీ నుంచి కొత్త 5G ఫోన్.. 120Hz OLED డిస్‌ప్లే, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
Advertisement

Sony Xperia 10 VIII: సోనీ నుంచి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. Xperia 10 VIII పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 50MP కెమెరా, Snapdragon 6 Gen 3 చిప్‌సెట్, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర ఎంత? ఇందులో ఇంకా ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం.

కొత్త సోనీ ఫోన్..

సోనీ తమ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో కొత్త Xperia 10 VIIIని ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. మూడు రంగుల్లో లభించే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర, రంగులు..

Advertisement

Sony Xperia 10 VIII ధర EUR 549గా ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.62,000కు సమానం. ఫ్రాస్టెడ్ గ్రే, ఫ్రోజెన్ వైట్, మిస్టీ లిలాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఏడాది చివర్లో ఎంపిక చేసిన మార్కెట్లలో సోనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Also Read: ఫోన్ వెనుక అతికించుకుంటే చాలు.. మాట్లాడిన ప్రతిమాటను నోట్స్‌గా మార్చే AI డివైజ్!

డిస్‌ప్లే, పనితీరు..

Advertisement

ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల Full-HD+ OLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు Gorilla Glass Victus 2 రక్షణ కూడా అందించారు. Snapdragon 6 Gen 3 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 8GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.

కెమెరాలు ఎలా ఉన్నాయంటే?

వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రధాన కెమెరాతో పాటు 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, ఇతర ఫీచర్లు..

Xperia 10 VIIIలో 5,000mAh బ్యాటరీ, ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 5G, Wi-Fi 6, Bluetooth 5.4, USB Type-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. IP65+IP68 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది. Android 16తో వచ్చే ఈ ఫోన్‌కు నాలుగు OS అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.

Also Read: వెయిటింగ్ ఈజ్ ఓవర్. Nothing Buds Pro 2 కేస్ డిజైన్, బ్యాటరీ వివరాలు లీక్!

Tags

Related News

మోటోరోలా నుంచి అదిరిపోయే వాషింగ్ మెషీన్.. 9 కేజీల ఫ్రంట్ లోడ్ ఫీచర్లు ఇవే!

ఐదు లేయర్ల ఫిల్టరేషన్‌తో Xiaomi కొత్త Air Purifier.. ఒక్కసారి ఫీచర్లు చూస్తే కొనాలనిపిస్తుంది!

ల్యాప్‌టాప్ క్లీన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే వేల రూపాయలు నష్టపోతారు!

7,050mAh బ్యాటరీతో అదరగొట్టనున్న Vivo T5 5G ఫోన్.. లాంచ్ డేట్ ఇదే!

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇక ఇంట్లోనే.. పూనకాలు తెప్పించే బ్లూటూత్ స్పీకర్లు!

ఫోన్ వెనుక అతికించుకుంటే చాలు.. మాట్లాడిన ప్రతిమాటను నోట్స్‌గా మార్చే AI డివైజ్!

వెయిటింగ్ ఈజ్ ఓవర్. Nothing Buds Pro 2 కేస్ డిజైన్, బ్యాటరీ వివరాలు లీక్!

Big Stories

Advertisement
×