E-Paper
Advertisement

దేశంలోనే అతిపెద్ద జిల్లా.. దీని ముందు రాష్ట్రాలూ దిగదుడుపే.. ఢిల్లీ కంటే 31 రెట్లు పెద్దది!

దేశంలోనే అతిపెద్ద జిల్లా.. దీని ముందు రాష్ట్రాలూ దిగదుడుపే.. ఢిల్లీ కంటే 31 రెట్లు పెద్దది!
Advertisement

India’s Largest District: పరిపాలనా సౌలభ్యం కోసం దేశంలోని రాష్ట్రాలను జిల్లాలుగా విభజించారు. అయితే ఓ జిల్లా విస్తీర్ణ పరంగా కొన్ని రాష్ట్రాల కంటే పెద్దది ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుజరాత్ లోని కచ్ జిల్లా.. దేశంలోనే అతిపెద్ద జిల్లాగా రికార్డుకెక్కింది. వైశాల్యం పరంగా ఈ జిల్లాకు ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

ఢిల్లీ కంటే 31 రెట్లు పెద్ద

కచ్ జిల్లా విస్తీర్ణం ఏకంగా 45,674 చదరపు కిలోమీటర్లు. మన దేశంలోని హర్యానా (44,212 చ.కి.మీ), కేరళ (38,863 చ.కి.మీ) వంటి పూర్తి స్థాయి రాష్ట్రాల కంటే కూడా ఇది పెద్దది. అంతేకాకుండా గోవా, ఢిల్లీ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల కంటే కచ్ అనేక రెట్లు విస్తారమైనది. ఉదాహరణకు ఢిల్లీ వైశాల్యంతో పోలిస్తే ఇది 31 రెట్లు, గోవా కంటే 12 రెట్లకు పైగా పెద్దది. ఒక్క గుజరాత్ రాష్ట్ర మొత్తం భూభాగంలో కచ్ జిల్లా వాటానే 23.27 శాతంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 20,92,371 మంది నివసిస్తున్నారు. సముద్రపు ఉప్పు నేలలు, ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ జనాభా సాంద్రత తక్కువగా ఉంది.

విభజించేందుకు అడ్డంకులు

Advertisement

కచ్ జిల్లా భౌగోళికంగా చాలా విస్తారమైనది కావడం వల్ల రవాణా, కనెక్టివిటీ, ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో పాలనను మరింత వేగవంతం చేసేందుకు జిల్లాను చిన్న విభాగాలుగా విభజించాలని ఎంతో కాలంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే జిల్లాను విడగొడితే దశాబ్దాలుగా ఉన్న స్థానిక సంస్కృతి, ప్రాంతీయ గుర్తింపు దెబ్బతింటాయని మరికొందరు వాదిస్తున్నారు. దీంతో ఈ పరిపాలనా సంస్కరణల అంశంపై రాజకీయ నేతలు, స్థానిక వర్గాల మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.

సాంస్కృతిక వైభవం..

కేవలం వైశాల్యంలోనే కాకుండా సాంస్కృతిక వారసత్వంలోనూ కచ్ ఎంతో విశిష్టమైనది. ఇక్కడి చేనేత వస్త్రాలు, వర్క్ ఎంబ్రాయిడరీ, లోహపు కళాఖండాలు, ఆభరణాలు, చెక్క బొమ్మలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి కళాకారుల ఉత్పత్తులు భారీగా విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. మరోవైపు శీతాకాలంలో తెల్లటి ఉప్పు ఎడారిగా మారే ‘రణ్ ఆఫ్ కచ్’ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అంతేకాకుండా దేశంలోనే ఏకైక గుడుఖర్ (అడవి గాడిద) అభయారణ్యం కూడా ఇక్కడే ఉంది.

ప్రపంచ వారసత్వ ప్రదేశం

Advertisement

కచ్‌లోని ‘ధోలవిరా’ ప్రాంతం సింధు లోయ నాగరికతకు ప్రతిరూపంగా నిలుస్తోంది. దీంతో యునెస్కో (UNESCO) ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. మరోవైపు ఆర్థిక పరంగా కూడా ఈ జిల్లా వేగంగా ఎదుగుతోంది. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రేవుల్లో ఒకటైన ముంద్రా పోర్ట్ ఇక్కడే ఉండి అంతర్జాతీయ వ్యాపారానికి ప్రధాన ద్వారంగా మారింది. వీటితో పాటు విస్తారమైన సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులతో గుజరాత్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా కచ్ అవతరిస్తోంది.

Also Read: ఆగస్టు 15న కాదు.. ఆ రెండు ఆలయాల్లో 4 రోజుల ముందే స్వాతంత్ర వేడుకలు.. కారణం తెలిస్తే షాకే?

అత్యంత చిన్న జిల్లా ఇదే..

కచ్ దేశంలోనే అతిపెద్ద జిల్లాగా నిలిస్తే.. పుదుచ్చేరిలోని మాహే (9 చ.కి.మీ) దేశంలోనే అత్యంత చిన్న జిల్లాగా ఉంది. అలాగే యానాం (30 చ.కి.మీ), లక్షద్వీప్‌లోని కవరత్తి కూడా చిన్న జిల్లాల జాబితాలో ఉన్నాయి. మరోవైపు వైశాల్యం కాకుండా జనాభా ప్రాతిపదికన చూస్తే మహారాష్ట్రలోని ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 2 కోట్ల కంటే ఎక్కువ మంది జీవిస్తున్నారు. గోవా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ వంటి అనేక రాష్ట్రాల మొత్తం జనాభా కంటే ముంబై జనాభానే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Also Read: ఇదేందయ్యా ఇది.. కూరగాయల షాప్‌లో ఈ రేంజ్ మార్కెటింగా? వీడియో చూస్తే మైండ్ బ్లాకే!

Tags

Related News

విజయవాడ నుంచి ఇండిగో సర్వీసులు.. ఏ నగరాలకు వెళ్తాయంటే?

తెలంగాణకు గుడ్ న్యూస్.. 2 అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

జస్ట్ 5 సెకన్లలో 800 కిమీ వేగం.. ఫ్యూచర్ బుల్లెట్ రైలు ఇదేనా?

పర్వతాల నుంచి ఎడారుల వరకు.. దేశంలో కచ్చితంగా చూడాల్సిన 8 బెస్ట్ ప్లేసెస్ ఇవే!

తాళాల స్థానంలో స్మార్ట్ కార్డ్స్.. హోటళ్లలో ఈ మార్పు ఎందుకు? దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?

వందే భారత్ కార్గో రైలు వచ్చేస్తోంది, స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ప్రతి భారతీయుడూ.. తప్పక చూడాల్సిన 10 సరిహద్దు ప్రాంతాలు!

Big Stories

Advertisement
×