Independence Day Travel: దేశంలో స్వాతంత్ర దినోత్సవం (పంద్రాగస్టు) వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు తప్పనిసరిగా సందర్శించాల్సిన దేశ సరిహద్దుల్లోని టాప్ – 10 ప్రాంతాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. ఇవి ప్రకృతి అందాలతో పాటు మన సైనికుల అపూర్వ విజయాలు, త్యాగాలకు ప్రతీకగా నిలవనున్నాయి. ఆ ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలేంటో ఈ స్పెషల్ ఆర్టికల్ లో చూద్దాం.
అమృత్‌సర్ సమీపంలో ఉన్న అట్టారీ-వాఘా బోర్డర్.. ప్రతిరోజూ జరిగే ‘బీటింగ్ రిట్రీట్’ వేడుకకు ఎంతో ప్రసిద్ధి చెందింది. భారత దళాలు (BSF), పాకిస్తాన్ రేంజర్లు సంయుక్తంగా నిర్వహించే ఈ కవాతు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా భారతీయ సైనికులు చూపించే తెగువ.. సందర్శకులలో అపారమైన దేశభక్తిని నింపుతుంది.
లడఖ్‌లోని ద్రాస్ వద్ద ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ అత్యంత పవిత్రమైన, భావోద్వేగభరితమైన ప్రాంతం. గులాబీ రంగు ఇసుకరాతితో నిర్మించిన ఈ స్మారక చిహ్నం.. 1999 కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన 527 మంది భారతీయ సైనికుల అమరత్వానికి నివాళిగా నిలుస్తుంది.
రాజస్థాన్ జైసల్మేర్ లోని థార్ ఎడారిలో ఉన్న ఈ చారిత్రాత్మక సరిహద్దు పోస్ట్.. 1971 నాటి యుద్ధానికి వేదిక. కేవలం 120 మంది భారతీయ సైనికులు పాకిస్తానీ సాయుధ దళాల దాడిని అత్యంత ధైర్యసాహసాలతో అడ్డుకుని తిప్పికొట్టిన మహత్తర చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది.
తూర్పు సిక్కింలో సముద్ర మట్టానికి దాదాపు 14,140 అడుగుల ఎత్తులో ఉన్న నాథూ లా పాస్.. అత్యంత కీలకమైన భారత్-చైనా సరిహద్దు ప్రాంతం. ఎత్తైన పర్వత శ్రేణులలో చైనా దళాలకు కొద్ది మీటర్ల దూరంలోనే ఉంటూ సరిహద్దులను రక్షిస్తున్న భారత సైనికులను ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ ఎత్తైన బోర్డర్ టౌన్.. ఆధ్యాత్మిక వారసత్వాన్ని, మిలిటరీ చరిత్రకు అద్దం పడుతుంది. హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతంలో భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధాలయం (మొనాస్టరీ), అందమైన ఆల్పైన్ సరస్సులు, భారత్-చైనా సరిహద్దు సమీపంలోని ‘బమ్ లా పాస్’ వంటి కీలకమైన పోస్ట్‌లు ఉన్నాయి.
తమిళనాడులో పాంబన్ దీవికి ఆగ్నేయంగా ఉన్న ధనుష్కోటి లేదా ధనుష్కోడి ఏంతో ప్రత్యేకమైనది. బంగాళఖాతం, హిందూ మహాసముద్రం ఈ ప్రాంతంలోనే కలుస్తాయి. ఇది దేశంలోని ప్రముఖ సరిహద్దు ప్రాంతాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
మేఘాలయలోని ఈ పట్టణం.. స్పటికమంత స్వచ్ఛమైన ‘ఉమ్నోట్’ నదికి ప్రసిద్ధి. ఇది ఖాసీ, జైంతియా కొండలను బంగ్లాదేశ్‌తో కలుపుతుంది. ఇక్కడి వేలాడే వంతెన (సస్పెన్షన్ బ్రిడ్జ్), బంగ్లాదేశ్ సరిహద్దు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని ఈ జిల్లా.. మూడు వైపులా నియంత్రణ రేఖ (LoC)ను కలిగి ఉంది. ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడి పూంచ్ స్పోర్ట్స్ స్టేడియంలో అత్యంత వైభవంగా జెండా వందనం వేడుకలు, దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గుజరాత్‌లోని ‘రాన్ ఆఫ్ కచ్’ ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారిగా గుర్తింపు పొందింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంట దాదాపు 7,500 చ.కి.మీ.కు పైగా విస్తరించి ఉన్న ఈ తెల్లటి ఉప్పు నేలలు.. సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి.
Also Read: మన దేశంలో.. మనకే అనుమతి లేని రాష్ట్రాలు.. వెళ్లాలంటే దరఖాస్తు తప్పనిసరి!
లడాఖ్‌లోని నుబ్రా వ్యాలీ చల్లటి గాలులతో దర్శనమిచ్చే ఏడారి ప్రాంతం. భారీ ఇసుక తిన్నెలు, అరుదైన ఒంటె జాతులు, 32 మీటర్ల ఎత్తైన మైత్రేయ బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ప్రాంతం.. పశ్చిమాన పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఉత్తర – పడమర చైనా ఆదీనంలోని సియాచిన్ గ్లేసియర్ ను సరిహద్దులుగా కలిగి ఉంది.
Also Read: ప్రతీ రోజూ 1.5GB డేటా ఇచ్చే.. రూ.330 లోపు జియో ప్లాన్స్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ ఫ్రీ!