E-Paper
Advertisement

మన దేశంలో.. మనకే అనుమతి లేని రాష్ట్రాలు.. వెళ్లాలంటే దరఖాస్తు తప్పనిసరి!

మన దేశంలో.. మనకే అనుమతి లేని రాష్ట్రాలు.. వెళ్లాలంటే దరఖాస్తు తప్పనిసరి!
Advertisement

ILP States India: సాధారణంగా భారతీయులకు దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా స్వేచ్ఛగా ప్రవేశించే హక్కు ఉంటుందని అందరూ భావిస్తుంటారు. అందులో కొంత వరకూ నిజం ఉన్నా.. 100% వాస్తవం అని చెప్పలేం. ఎందుకంటే దేశంలోని ఓ 4 రాష్ట్రాల్లో ప్రవేశించాలంటే.. ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ కు వెళ్లాలంటే.. ప్రయాణానికి ముందే ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) తీసుకోవాల్సిందే. అయితే ఈ ఐఎల్‌పీ అంటే ఏంటి? ఆ రాష్ట్రాల్లో పర్యటించాలంటే ఎందుకు ఇది అవసరం? దీని వెనుక కారణాలేంటి? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే?

సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఐఎల్‌పీ అనేది ఒక అధికారిక అనుమతి పత్రం. రాష్ట్రేతరులు.. నిర్ధిష్ట కాలపరిమితితో అక్కడ పర్యటించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ పర్మిట్ కాలవ్యవధి, ఛార్జీ, దరఖాస్తు ప్రక్రియ ఆ 4 రాష్ట్రాల్లో (అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్) వేర్వేరుగా ఉంటాయి. పర్యాటకుల సౌకర్యార్థం ప్రస్తుతం ఈ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారానే పూర్తి చేసుకునే వెసులుబాటును ఆయా రాష్ట్రాలు కల్పిస్తున్నాయి.

ఈ వ్యవస్థ ఎందుకు వచ్చింది?

Advertisement

ఈ పర్మిట్ వ్యవస్థ మూలాలు బ్రిటిష్ కాలం నాటి ‘బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ – 1873’ చట్టంలో ఉన్నాయి. ఆ సమయంలో మైదాన ప్రాంతాల ప్రజలు.. కొండ ప్రాంతాల్లోకి స్వేచ్ఛగా వెళ్లకుండా నిరోధించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ ‘ఇన్నర్ లైన్’ నిబంధనను తీసుకువచ్చింది. స్థానిక గిరిజనులతో ఘర్షణలు రాకుండా నియంత్రించడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే స్వాతంత్రం వచ్చాక ఈ చట్టం స్వరూపం మారింది. ఈశాన్య భారతంలోని దశాబ్దాల తరబడి ఉన్న గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు, వారి భూములను పరిరక్షించడానికి ఈ వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్నారు.

పర్మిట్ రూల్స్.. రాష్ట్రాలవారీగా

అరుణాచల్ ప్రదేశ్

ఈ రాష్ట్రంలో పర్యటించడానికి ‘eILP’ అవసరం. దీని ద్వారా గరిష్టంగా 14 రోజుల బసకు అనుమతి లభిస్తుంది. 3 రోజుల వరకు రూ. 300, ఆపై 14 రోజుల వరకు రూ. 500 రుసుముగా స్థానికేతరులు చెల్లించాలి.

నాగాలాండ్

Advertisement

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 30 రోజుల పరిమితి ఉన్న పర్మిట్ కోసం రూ. 200 రుసుము ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మిజోరాం

ఈ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు సాధారణంగా 15 రోజుల తాత్కాలిక పర్మిట్ ను అక్కడి ప్రభుత్వం జారీ చేస్తుంది. దీనిని మరో 15 రోజులు పొడిగించుకునే అవకాశం సైతం ఉంది. అవసరాన్ని బట్టి 6 నెలల వ్యాలిడిటీ ఉండే రెగ్యులర్ పర్మిట్లు కూడా ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి.

మణిపూర్

2019 డిసెంబర్ నుంచి మణిపూర్ ను ఈ ఐఎల్‌పీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలోకి వచ్చే స్వల్పకాలిక సందర్శకులకు 30 రోజుల తాత్కాలిక పర్మిట్ జారీ చేస్తారు. దీనికి రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఇంఫాల్ విమానాశ్రయం, మావో గేట్, జిరీబామ్ గేట్ వద్ద కూడా ఈ ఐఎల్‌పీ ని పొందొచ్చు.

Also Read: పొట్టకూటి కోసం నేలను తవ్వితే.. రూ.50 లక్షల వజ్రం దొరికింది.. జాక్ పాట్ కొట్టిన కూలీలు!

కావాల్సిన ధ్రువపత్రాలు

ఆ 4 రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్తూ.. ఐఎల్‌పీకి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలను సదరు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో ఐడెంటిటీ కార్డ్, పాస్ట్ పోర్ట్ సైజ్ ఫొటో, ప్రయాణ వివరాలు, లోకల్ గా ఎవరైన పరిచయం ఉంటే వారి డీటైయిల్స్ దరఖాస్తు ఫామ్ లో పొందుపరచాల్సి ఉంటుంది. మెుత్తం మీద ప్రయాణానికి కొద్ది రోజుల ముందు ఆయా రాష్ట్రాల అధికారిక వెబ్‌సైట్‌లలో నిబంధనలను సరిచూసుకుని దరఖాస్తు చేసుకుంటే ఈశాన్య రాష్ట్రాలను హ్యాపీగా, ప్రశాంతంగా చుట్టి రావొచ్చు.

Also Read: BSNL బిగ్ ధమాకా ప్లాన్.. రూ. 319 కే 65 రోజుల వ్యాలిడిటీ.. ఇదేం ఆఫర్ బాబోయ్!

Tags

Related News

ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ప్రతి భారతీయుడూ.. తప్పక చూడాల్సిన 10 సరిహద్దు ప్రాంతాలు!

1964లో మూసేసిన రైల్వే లైన్.. ఇప్పుడు ఏటా 60 వేల మంది సందర్శించే టూరిస్ట్ స్పాట్.. అలా ఎలా?

టికెట్ బుకింగ్ To లైవ్ ట్రాకింగ్.. ప్రయాణికులను ఆకట్టుకుంటున్న రైల్‌ వన్ యాప్‌!

ఇక మరింత సౌకర్యవంతంగా లోకల్ రైళ్లు.. వందే మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ఏఐతో ఏనుగులు సేఫ్, ఇక రైలు ప్రమాదాలు ఉండవట!

7 అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రైళ్లు వస్తున్నాయంటే?

ఏ దేశంలో ఉద్యోగం చేస్తే అత్యధిక జీతం వస్తుంది? ప్రపంచంలో టాప్ 10 దేశాలు ఇవే

Big Stories

Advertisement
×