E-Paper
Advertisement

నగరాన్ని కమ్మేసే పొగమంచు… హీరోయిన్ల వరుస హత్యలు… అదృశ్య కిల్లర్ అరాచకం

నగరాన్ని కమ్మేసే పొగమంచు… హీరోయిన్ల వరుస హత్యలు… అదృశ్య కిల్లర్ అరాచకం
Advertisement

Her Private Hell OTT : జపాన్‌ను తలపించే ఓ ఫ్యూచరిస్టిక్ నగరం… ఒక్కసారిగా నగరమంతా భయంకరమైన పొగమంచుతో నిండపోతే ? అదే సమయంలో యువ నటీమణులను టార్గెట్ చేస్తూ ఓ అదృశ్య సీరియల్ కిల్లర్ తిరుగుతుంటే ? తన తండ్రి కోసం వెతుకుతున్న ఓ యువ నటి, తన కూతురిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ అమెరికన్ సైనికుడు ఒకే దారిలో కలిస్తే ? ఆ తర్వాత వాళ్లు అడుగు పెట్టేది హింస, గ్లామర్, భయం కలిసిన ఓ చీకటి ప్రపంచంలోకి. సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ అంశాలను కలిపి తెరకెక్కించిన ‘హర్ ప్రైవేట్ హెల్’ (Her Private Hell) మూవీ కథ ఇదే. మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

భవిష్యత్ కాలంలో ఉన్న ఓ అత్యాధునిక మెట్రోపాలిటన్ నగరంలో కథ మొదలవుతుంది. నగరం మొత్తం ఆధునికంగా, నియాన్ లైట్లతో మెరిసిపోతుంటుంది. కానీ ఒక్కసారిగా అక్కడ ఓ వింతైన పొగమంచు కమ్ముకుంటుంది. దాని వెనుక ఏదో ప్రమాదం దాగి ఉందని అర్థమయ్యేలోపే నగరంలో వరుసగా దారుణమైన హత్యలు మొదలవుతాయి. ఈ హత్యలకు కారణం ‘ది లెదర్ మ్యాన్’ అని పిలిచే ఓ భయంకరమైన కిల్లర్. అతని టార్గెట్ ప్రధానంగా యువ నటీమణులే. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియని ఆ కిల్లర్ కారణంగా నగరం మొత్తం భయంతో వణికిపోతుంది.

Advertisement

ఇదే సమయంలో కథలోకి ఎల్లే అనే యువ నటి వస్తుంది. మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎల్లే, ఈ గందరగోళం మధ్య కనిపించకుండా పోయిన తన తండ్రి కోసం వెతుకుతుంటుంది. అయితే తండ్రి కోసం వెతికే క్రమంలో ఆమెకు ఊహించని భయంకరమైన నిజాలు ఎదురవుతాయి. ఓ దశలో ఎల్లే ఓ యువ నటి దారుణంగా హత్యకు గురవడాన్ని కళ్లారా చూస్తుంది. ఆ సంఘటన తర్వాత ఆమెకు అసలు తాను ఎలాంటి ప్రపంచంలో చిక్కుకుందో అర్థమవుతుంది.

అదే సమయంలో ప్రైవేట్ కె అనే అమెరికన్ సైనికుడు కూడా తన కూతురిని వెతుకుతూ ఉంటాడు. లెదర్ మ్యాన్ చేతుల్లో చిక్కుకున్న తన కూతురిని ఎలాగైనా రక్షించాలనే పట్టుదలతో అతను నగరంలోని చీకటి ప్రాంతాల్లోకి వెళ్తుంటాడు. అలా తమ తమ లక్ష్యాలతో ప్రయాణిస్తున్న ఎల్లే, ప్రైవేట్ కె ఒకరినొకరు కలుసుకుంటారు. మొదట ఇద్దరి లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నా, లెదర్ మ్యాన్ వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే కొద్దీ వాళ్ల దారులు ఒక్కటవుతాయి.

Advertisement

ఇక అక్కడి నుంచి సినిమా మరింత డార్క్ వరల్డ్ లోకి వెళ్తుంది. గ్లామర్, హింస, భయం, నేరాలతో నిండిన ఆ విచిత్రమైన నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి ? లెదర్ మ్యాన్ నిజంగా ఎవరు ? అతని టార్గెట్ యువ నటీమణులే ఎందుకు ? ఎల్లే తన తండ్రిని కనుగొనగలిగిందా ? ప్రైవేట్ కె తన కూతురిని కాపాడగలిగాడా? అనేదే మిగిలిన కథ.

Also Read : విడాకుల నోటీసు ఇచ్చిన 2 రోజులకే శవమయ్యే భార్య… తెలుగులో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

స్ట్రీమింగ్ డీటైల్స్

సోఫీ థాచర్, చార్లెస్ మెల్టన్, డౌగ్రే స్కాట్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హర్ ప్రైవేట్ హెల్’ సినిమాకు నికోలస్ విండింగ్ రెఫ్న్ దర్శకత్వం వహించారు. నియాన్ పింక్, బ్లూ లైటింగ్, మైండ్ బెండింగ్ మ్యూజిక్, స్యూరియల్ విజువల్స్‌తో సినిమా ఓ అందమైన పీడకలలా అనిపిస్తుంది. కథనం మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతుంది. హారర్, సైన్స్ ఫిక్షన్, డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. సినిమా Amazon Prime Videoలో రెంట్ కి అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు.

Related News

మనుషుల్ని చంపే పులిని పట్టుకోవడానికెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

ప్రేమించిన అమ్మాయిని లాక్కుని జైలుకు… తిరిగొచ్చాక వీడి ఊచకోత చూస్తే గూస్ బంప్స్

ప్రాణాంతక అనారోగ్యం మధ్య పుట్టిన ప్రేమకథ… తెలుగులో ఎక్కడ చూడాలి?

విడాకుల నోటీసు ఇచ్చిన 2 రోజులకే శవమయ్యే భార్య… తెలుగులో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

ఆఫీసులో ఆరేళ్లు ప్రేమ… కట్ చేస్తే కార్పొరేట్ ప్రపంచం నుండి దూరంగా… ఫీల్ గుడ్ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ డ్రామా

నాలుగో అంతస్తులో ఏం ఉంది? ఈ హార్రర్ మిస్టరీ ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంది

62 ఏళ్ల చరిత్రకు ముగింపు… కార్గిల్‌లో శత్రువులకు చుక్కలు చూపించిన ఆ విమానం కథ ఇదే

Big Stories

Advertisement
×