E-Paper
Advertisement

Supreme Court: వైసీపీకి సుప్రీంకోర్టులో ఝలక్.. రిట్ పిటిషన్ డిస్మిస్, కనీసం వాదనలు వినేందుకు..

Supreme Court: వైసీపీకి సుప్రీంకోర్టులో ఝలక్.. రిట్ పిటిషన్ డిస్మిస్, కనీసం వాదనలు వినేందుకు..
Advertisement

Supreme Court: ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. లోపం ఎక్కడుందో తెలీదుగానీ చివరకు న్యాయస్థానాలు సైతం వారి మాటలు వినేందుకు మొగ్గు చూపడం లేదు. తాజాగా వైసీపీకి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. కనీసం వాదనలు వినేందుకు కూడా న్యాయస్థానం మొగ్గు చూపలేదు. అసలు ఏం జరిగింది?

 

వైసీపీకి సుప్రీంకోర్టులో ఝలక్

Advertisement

ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో తమ సోషల్ మీడియా ఖాతాలను నిలిపి వేశారంటూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌తోపాటు లేళ్ల అప్పిరెడ్డి కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ దీపాంకర్ దత్తా-జస్టిస్ షీల్‌నాగు ధర్మాసనం ముందుకు వచ్చింది. కర్నూలు-గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు నమోదు చేశారని అందులో ప్రస్తావించారు.

సీఐడీ నమోదు చేసిన మరో క్రిమినల్‌ కేసుని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినేందుకు ఇద్దరు సభ్యుల ధర్మాసనం విముఖత చూపింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించలేమని తెల్చిచెప్పింది. ఏదన్నా ఉంటే హైకోర్టుకు వెళ్లాలని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇందులో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని పేర్కొంది.

Advertisement

 

సోషల్ మీడియాలో ఖాతాలు నిలిపివేతపై పిటిషన్

వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి రకరకాల పోస్టులు ఉండడంతో అధికారిక పేజీని తొలగించారు పోలీసులు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఎక్స్ మిగతా విభాగాల్లో పోస్టులు పెట్టింది. అధికారిక ఖాతాలను తొలగించడంపై పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేకుండా కంటెంట్ తొలగించారని, భావ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని పిటిషన్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. రాజ్యాంగబద్దమైన హక్కుల పరిరక్షణకు-స్థానిక అంశాల విచారణకు హైకోర్టులో అందుబాటులో ఉందని తెలిపింది. ముందుగా అక్కడే వాదనలు వినిపించాలని పేర్కొంది.  నేరుగా ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుని ఆశ్రయించడం తగదని ప్రస్తావించింది.

ALSO READ: శ్రీశైలంలో దారుణం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు ఆత్మహత్య

కేవలం సుప్రీంకోర్టు విషయంలోనే కాదు..మెగా డీఎస్సీపై హైకోర్టులో వైసీపీకి చుక్కెదురు అయ్యింది. వైసీపీ నేత వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెల్సిందే. సుప్రీం సూచనలతో హైకోర్టులో పిటిషన్ వేయాలని వైసీపీ డిసైడ్ అయ్యింది.

 

Related News

గుడ్ మార్నింగ్ సీఎం అంటూ.. పోలీసుల మోహరింపు ఎందుకని షర్మిల ప్రశ్న

టీడీపీ చేరిన నెల రోజులకే మజ్జి శ్రీనుకు బిగ్ టాస్క్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపించుకుంటే

చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లకు స్వస్తి చెప్పాలి: బొత్స సత్యనారాయణ

పోలవరం ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు!

జ్ఞానేష్ కుమార్ మోదీకి బానిస!.. అఖిలపక్ష భేటీలో ఫైర్ అయిన వైఎస్ షర్మిల

ఆంధ్రా యూనివర్సిటీలో కొకైన్ కలకలం.. పోలీసుల రికార్డుల్లో షాకింగ్ నిజాలు!

సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేసిన నందమూరి లక్ష్మీపార్వతి.. ఏమన్నారంటే?

ఎన్నికలంటే వైసీపీకి వణుకు.. అందుకే న్యాయస్థానాలకు, పార్టీ పరంగా బీసీలకు న్యాయం-సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×