E-Paper
Advertisement

ప్రేమించిన అమ్మాయిని లాక్కుని జైలుకు… తిరిగొచ్చాక వీడి ఊచకోత చూస్తే గూస్ బంప్స్

ప్రేమించిన అమ్మాయిని లాక్కుని జైలుకు… తిరిగొచ్చాక వీడి ఊచకోత చూస్తే గూస్ బంప్స్
Advertisement

Motor City OTT : ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి జీవితం, ఓ గ్యాంగ్‌స్టర్ కారణంగా ఒక్కసారిగా నాశనమైతే ? చేయని నేరానికి జైలుకు వెళ్లి, అక్కడ నరకం లాంటి శిక్ష అనుభవించిన తర్వాత… అదే వ్యక్తి ప్రేమ కోసం కాదు… తన జీవితాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కరిపై పగ తీర్చుకోవడం కోసం తిరిగి నగరంలోకి వస్తే ? అలాన్ రిచ్‌సన్ నటించిన వైల్డ్ రివేంజ్ యాక్షన్ మూవీ ‘మోటార్ సిటీ’ (Motor City) మూవీ కథ ఇదే. మరి రక్తాన్ని మరిగించే ఈ రివేంజ్ డ్రామాను తెలుగులో చూడొచ్చా ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1970ల నాటి డెట్రాయిట్ నగరం… 1977లో కథ నడుస్తుంది. జాన్ మిల్లర్ శ్రామిక వర్గానికి చెందిన వ్యక్తి. ఓ రోజు నైట్‌క్లబ్‌లో సోఫియా అనే యువతిని కలుసుకోవడంతో అతని జీవితం మారిపోతుంది. ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. కానీ సోఫియా గతం గురించి జాన్‌కు తెలియని ఓ విషయం ఉంటుంది. ఆమె నగరంలోని అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ రెనాల్డ్స్ మాజీ ప్రియురాలు. జాన్, సోఫియాను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న రెనాల్డ్స్ ఆగ్రహంతో రగిలిపోతాడు. తనకు అడ్డుగా నిలిచిన జాన్‌ను ఎలాగైనా తొలగించాలని నిర్ణయించుకుంటాడు.

Advertisement

దీంతో ఓ అవినీతి పోలీస్ అధికారి లెఫ్టినెంట్ సావిక్ సహాయంతో జాన్‌పై డ్రగ్స్ కేసు బనాయిస్తాడు. చేయని నేరానికి జాన్ జైలుకు వెళ్తాడు. అక్కడ అతను ఊహించని దారుణాలను ఎదుర్కొంటాడు. ఇక జాన్‌ను మానసికంగా కూడా పూర్తిగా కుంగదీయాలని రెనాల్డ్స్ ప్రయత్నిస్తాడు. సోఫియాను బలవంతంగా పెళ్లి చేసుకుని, ఆ పెళ్లి ఫొటోలను జైలులో ఉన్న జాన్‌కు పంపిస్తాడు. తన ప్రేమను, స్వేచ్ఛను, జీవితాన్ని ఒక్కొక్కటిగా కోల్పోతున్న జాన్‌లో అప్పటికే కోపం పెరుగుతూనే ఉంటుంది.

చివరికి జైలు నుంచి బయటకు వచ్చిన జాన్‌కు జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం మిగులుతుంది. తనను మోసం చేసిన వాళ్లందరిపై పగ తీర్చుకోవడం. అలా అతను తిరిగి డెట్రాయిట్‌లోకి అడుగు పెడతాడు. కానీ ఈసారి వచ్చింది పాత జాన్ కాదు. తనను జైలుకు పంపిన ప్రతి ఒక్కరినీ వెతుక్కుంటూ వెళ్లి ఒక్కొక్కరిపై దాడి చేయడం మొదలు పెడతాడు. గ్యాంగ్‌స్టర్లను ఎదుర్కొంటూ, అవినీతి పోలీసులపై విరుచుకు పడుతూ చివరకు రెనాల్డ్స్ దగ్గరకు చేరుకుంటాడు. జాన్ తన ప్రతీకారం తీర్చుకోగలిగాడా? రెనాల్డ్స్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? సోఫియా పరిస్థితి ఏంటి? తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్లను శిక్షించిన తర్వాత జాన్‌కు మిగిలేది ఏమిటి? అనేదే సినిమా కథ.

Advertisement

Also Read : ప్రాణాంతక అనారోగ్యం మధ్య పుట్టిన ప్రేమకథ… తెలుగులో ఎక్కడ చూడాలి?

తెలుగులో మాత్రం లేదు

అలాన్ రిచ్‌సన్, షైలీన్ వుడ్లీ, బెన్ ఫోస్టర్, పాబ్లో ష్రైబర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు పోట్సీ పోన్సిరోలి దర్శకత్వం వహించారు. దాదాపు 1 గంట 43 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 70ల నాటి డెట్రాయిట్ వాతావరణాన్ని, వైల్డ్ రివెంజ్ యాక్షన్‌ను కలిపి చూపిస్తుంది. ముఖ్యంగా హీరో పెద్దగా డైలాగులు చెప్పకుండా యాక్షన్, విజువల్స్‌తో కథను ముందుకు నడిపించడం సినిమా ప్రత్యేకత. జాక్ వైట్ అందించిన రాక్ మ్యూజిక్ కూడా సినిమాకు మరింత ఇంటెన్సిటీ తీసుకొస్తుంది. ‘మోటార్ సిటీ’ ఆగస్టు 25 నుంచి Amazon Prime Videoలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు. డైలాగుల కంటే యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న రా రివెంజ్ డ్రామా ఇది. యాక్షన్ ప్రియులు డోంట్ మిస్.

Related News

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

Big Stories

Advertisement
×