E-Paper
Advertisement

Boat Race In Ap: సంక్రాంతికి కొత్త ట్రెండ్.. ఇదేమి కేరళ కాదు.. మన ఆత్రేయపురం

Boat Race In Ap: సంక్రాంతికి కొత్త ట్రెండ్.. ఇదేమి కేరళ కాదు.. మన ఆత్రేయపురం
Advertisement

Boat Race In Ap: సంక్రాంతి వచ్చిందంటే అందరికీ ఎక్కువగా గుర్తు కొచ్చేవి కోడి పందాలు, ఎడ్ల పందాలు, గుండాట వంటి ఆటలు. చాలా ఏళ్లుగా ఏపీలో సంక్రాంతి మొదలు ఈ తరహా ఆటలు  కొనసాగుతాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి పడవల పోటీలు మొదలయ్యాయి. ఒక విధంగా ఆ పోటీలు కేరళాను తలపించే విధంగా ఉన్నాయి.

ఏపీలో ఈసారి సంక్రాంతికి కొత్త ట్రెండ్

Advertisement

సంక్రాంతి పండుగ నేపథ్యంలో కేరళ మాదిరిగా ఈసారి పడవ పోటీలు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తూర్పుఆత్రేయపురం వేదికైంది. ఆత్రేయపురం ఉత్సవ్‌-ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించాయి. జాతీయ స్థాయిలో పడవ పోటీలు హోరా హోరీగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 22 టీమ్‌లు ఇందులో పాల్గొన్నాయి.

ఒక్కో టీమ్‌లో 10 మంది చొప్పున క్రీడాకారులు పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది తరలి వచ్చారు. కాలువ గట్టు ఇరువైపులా తాడిపూడి వంతెనపై నుంచి జనం ఆ పోటీలను తిలకించారు. కేరళలో జరిగే తరహా కోనసీమలో నిర్వహిస్తుండడంతో అక్కడ పండుగ వాతావరణం సరికొత్త శిఖరాలకు చేరింది.

Advertisement

కేరళను తలపించేలా ఆత్రేయపురంలో పడవ పోటీలు

సెమీఫైనల్స్‌లో బండారు టీమ్‌, కోనసీమ టీమ్‌, పల్నాడు టీమ్‌, కేరళ టీమ్‌, అలెప్పి టీమ్‌, ఎర్ర కాలువ టీమ్‌లు తలపడనున్నాయి. మొదటి మూడు స్థానాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విన్నర్‌కు రూ. 2లక్షలు, ఫస్ట్ రన్నరప్‌కి లక్ష, సెకండ్ రన్నరప్ జట్టుకు 50 వేలు ట్రోఫీలతో సత్కరించనున్నారు నేతలు, అధికారులు.

పడవ పోటీల సందర్భంగా ప్రధాన కాలువలో కేరళ యువకుడు స్కైబోటుపై చేసిన విన్యాసం పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఈ పోటీలపై మంత్రి లోకేష్ ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు. ఇది కేరళ కాదని, ఆంధ్ర‌ప్రదేశ్‌‌లోని ఆత్రేయపురం అని రాసుకొచ్చారు. పండుగ వాతావరణం సరికొత్త శిఖరాలకు చేరందంటూ ప్రస్తావించారు.

ALSO READ:  సంక్రాంతికి పండగ మర్యాదలు..  కొత్త అల్లుడికి 158 వంటకాల విందు

 

Related News

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

Big Stories

Advertisement
×