Illu Illalu Pillalu Today Episode September 13th:తిరుపతిని తీసుకుని ఒక గుడికి వెళ్లి అక్కడ పెళ్ళి చేయాలి అని అనుకుంటాడు ధీరజ్.. ప్రేమ ధీరజ్ లో ఇద్దరూ కలిసి వాళ్లకి పెళ్లి చేయడానికి గుడికి తీసుకుని వెళ్తారు అక్కడ పంతులు గారిని మేనేజ్ చేసి మొత్తానికి పెళ్లి చేసేస్తారు.. ఎలాగైనా సరే ఈ విషయం గురించి ఇంట్లో చెప్పలేని అనుకుంటారు తిరుపతి మాత్రం నా పొలంలో మొలకలు వచ్చేసాయి ఎన్ని రోజులు నేను వెయిట్ చేస్తున్నాను నా పెళ్లి జరిగిపోయింది అంటే చాలా సంతోషంగా ఉంటాడు. మొత్తానికి ధీరజ్ తిరుపతి పెళ్లి అయితే చేసేస్తాడు. సుకన్య కూడా కోట్ల ఆస్తికి నేను మహారాణి నేను కాబోతున్నాను అని చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అందరూ కూడా ఇంటికి వెళ్లి పెద్దవాళ్లకి చెప్పాలని అనుకుంటారు కానీ తిరుపతి మాకు మీరే పెద్దవాళ్లు మీరు ఆశీర్వదించండి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని అనగానే ధీరజ్, ప్రేమ ఎమోషనల్ అయిపోతారు.. పెళ్లి జరగడం చూసిన నర్మదా షాక్ అవుతుంది.
తిరుపతి సుకన్య నిజంగానే ప్రేమించుకున్నారని దీవించి ప్రేమలు ఇద్దరు కూడా వాళ్ళిద్దర్నీ కలపాలి అని చాలా కష్టపడతారు. ఒకవేళ వాళ్ళిద్దరు పెళ్లి జరగకపోతే చచ్చిపోతారు అని ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. కానీ పెళ్ళికొడుకుని మండపం నుంచి తీసుకుని వచ్చిన ధీరజ్వేరొక గుళ్లో పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయిపోతాడు. ఇక అందరూ వచ్చేలోగా పెళ్లి జరిపించాలి అని ధీరజ్ వెంట వెంటనే పంతులు తో మాట్లాడి తిరుపతి పెళ్లిని పూర్తి చేస్తాడు. అయితే తిరుపతి పెళ్లికి ఎవరు పెద్దలు లేకపోవడంతో ధీరజ్ ప్రేమలో కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు ఇది ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. మీరేంటి నా కాళ్ళ మీద పడడం అని ధీరజ్ ఎంత చెప్తున్నా సరే మీ కన్నా మాకు పెద్ద వాళ్ళు ఎవరూ లేరు ముందు పెళ్లి అయింది కాబట్టి మీరే పెద్దవాళ్ళు అని తిరుపతి అంటారు.
నర్మదా అన్ని గుళ్ళు వెతుక్కుంటూ వచ్చేలోగా తిరుపతి తీసుకొని అలా పెళ్లి జరిగిపోతుంది. అది చూసిన నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ధీరజ్ నువ్వేం చేసావు? ఎందుకు ఇప్పుడు ఇవ్వాలి ఇద్దరు పెళ్లి చేశావు. దీనివల్ల రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎంతగా పెరుగుతాయో తెలుసా నీకు అని నర్మదా అరుస్తుంది. ఒక జంటని కలపాలని అనుకున్నావు సరే అంతవరకు బాగానే ఉంది కానీ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు సంగతి నీకు తెలుసు కదా మళ్లీ ఎందుకు ఇలాంటి తప్పు చేశావు అని ధీరజ్ పై నర్మదా ఆవేశపడుతూ కోపంతో రగిలిపోతుంది. మీకు కూడా పెళ్లి చేశాను కదా వదినా అప్పుడు ఇలాంటి గొడవలు గుర్తుకు రాలేదా అని ధీరజ్ ఏదో ఒకటి కవర్ చేయాలని అనుకుంటాడు. కానీ నర్మద దెబ్బకు ధీరజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతాడు. ఇక తర్వాత ఇంట్లో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగితే మాత్రం దాని కారణం నువ్వే అని నర్మదా అంటుంది.
నువ్వు తప్పు చేశావు ధీరజ్ ఇప్పుడు ప్రేమ వాళ్ళ కుటుంబంలోని వాళ్ళందరూ కూడా నీ మీద ఇంకాస్త కోపాన్ని పెంచుకుంటారు.. నువ్వే ఇదంతా కావాలని చేశావు అని వాళ్ళు నిన్ను ఇంకా అంత దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు నువ్వు నిజంగానే ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు ఇప్పుడు ఎలాంటి గొడవలు జరుగుతాయో అని నాకు చాలా భయంగా ఉంది.. అని నర్మదా ధీరజ్ తో అంటుంది ఏం జరిగినా నేను చూసుకుంటాను వదిన. ఒక ప్రేమ జంటని కలిపాను అని నాకు చాలా ఆనందంగా ఉంది అని ధీరజ్అం టాడు.
వేదవతి రామరాజు కోసం అని కాఫీ తీసుకొని వచ్చి నా మొహం కూడా చూడట్లేదు మీరు అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే రామరాజు వేదవతికి పెట్టిన కండిషన్ గురించి మర్చిపోయి తనతో ఎలాగైనా మాట్లాడాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. అప్పుడే ధీరజ్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి అమ్మ నాన్న అంటూ గట్టిగా అరుస్తూ వస్తాడు. మీకు ఒక విషయం చెప్పాలి బయటికెళ్దాం పదండి అని వాళ్ళని బయటకు తీసుకుని వెళ్ళగానే అక్కడ తిరుపతి సుకన్యను పెళ్లి బట్టలో చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరిద్దరూ వాళ్ళిద్దర్నీ ఆశీర్వదించాలమ్మ అని ధీరజ్ అనగానే ఏంట్రా ఆశీర్వదించేది ఈ మాయలాడితో వాడి పెళ్లి చేస్తావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు రా అని వేదవతి సీరియస్ అవుతుంది. అసలు నువ్వు చేసింది ఏంటి వీడికి పెళ్లి చేసావా నువ్వు ఏమనుకుంటున్నావు అసలు అని వేదవతి ధీరజ్ పై సీరియస్ అవుతుంది.
ఏమే మాయలోడి నా తమ్ముని మాయ చేసి పెళ్లి చేసుకుంటావా అసలు నీకు ఎంత ధైర్యమే నా తమ్ముని పెళ్లి చేసుకోవడానికి అని వేదవతి సుకన్యను చెంపలు వాయించి కొడుతుంది. నువ్వెక్కడ దొరికావే మా కుటుంబానికి ఎందుకే నువ్వు మా తమ్ముని మాయ చేసి పెళ్లి చేసుకున్నావు అంటూ ధీరజ్ ఎంతగా ఆపే ప్రయత్నం చేసిన కూడా వేదవతి ఆగకుండా సుకన్య అని పడుతుంది. నా తమ్ముడు నీ మోసం చేసి పెళ్లి చేసుకుంది దీనివల్ల నా కుటుంబం ఏమవుతుందో అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ధీరజ్ పై సీరియస్ అవుతుంటారు.. అటు వల్లి కూడా ఎంత పని చేసావే అని కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నర్మదా ప్రేమ వాళ్లు ఎంతగా వేదవతిని ఆపాలని చూసినా కూడా ఆగకుండా సీరియస్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..