E-Paper
Advertisement

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..
Advertisement

Amaravati: అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. సమావేశంలో 12 గంటలు కూర్చోలేకపోతే ఎలా? తమాషాలు ఆడుతున్నారా అంటూ రుసరుసలాడారు. ఫోన్లు తేవద్దని ముందే చెప్పానని, ఫోకస్ అంతా పనిపై ఉండాలన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగింది?

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఓ వైపు అభివృద్ది.. మరోవైపు సంక్షేమం రెండింటినీ పరుగులు పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తు్న్నారు సీఎం చంద్రబాబు. తన ఆలోచనలకు అనుగుణంగా అధికారులు మెల్లగా వెల్లడాన్ని తప్పుబట్టారు. రెండురోజులుగా అమరావతి సచివాలయంలో కలెక్టర్లతో మీటింగ్ జరుగుతోంది.

Advertisement

రెండో రోజు శనివారం ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం చేస్తున్న అధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. వాట్సాప్ మెసేజ్‌లపై పెడుతున్న శ్రద్ధ, ఫైళ్ల క్లియరెన్స్‌పై ఎందుకు చూపించడం లేదని మంత్రులతో పాటు పలుశాఖల అధికారులపై సీరియస్ అయ్యారు. తాను పదే పదే చెబుతున్నానని, ఒక చెవిలో విని.. మరొక చెవిలో విడిచిపెట్టారని అసహనం వ్యక్తం చేశారు.

అమరావతిలో రెండోరోజు కలెక్టర్లు మీటింగ్

ఫోకస్ చేయడానికి సమావేశానికి ఫోన్లు తేవద్దని చెప్పానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 గంటలు కూర్చోపోలే వీలెందుకని ప్రశ్నించారు. తమాషాలు ఆడుతున్నారా! చివరకు ఫైల్ క్లియర్ చేయడానికి ప్రోటోకాల్ అధికారులకు సమయం పడుతుందని విరుచుకుపడ్డారు.  కలెక్టర్ల సదస్సుకు రాని అధికారులపై మండిపడ్డారు.

Advertisement

గైర్హాజరు కావడానికి వారికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. ఫైల్స్ పెండింగ్‌కు కారణాలపై అధికారుల పేర్లను ఒక్కొక్కటిగా చదువుతూ కాసింత ఆగ్రహానికి లోనయ్యారు. హెచ్‌వోడీల వద్ద ఫైళ్లు ఎందుకు ఆలస్యమవుతున్నాయని నిలదీశారు. ఆలస్యం చేస్తున్న వారి నుంచి వివరణ తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి.

ALSO READ: విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

రాబోయే రోజుల్లో అధికారుల పనితీరుపై 360 డిగ్రీల ఒపీనియన్లు తీసుకుంటానని ఘాటుగా హెచ్చరించారు. అదే సమయంలో మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్‌ వద్ద దస్త్రాల క్లియరెన్స్‌కు ఎక్కువ సమయం పడుతోందన్నారు. తాను కూడా ఫైల్స్‌ క్లియర్‌ చేయడానికి నాలుగు రోజులు తీసుకుంటున్నానని చెప్పిన ముఖ్యమంత్రి, హోంమంత్రి సహా ప్రతి ఒక్కరూ నిర్ణయాల వేగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు.

ఫైల్‌ కదలికకు పట్టే ప్రతిరోజు పాలనపై ప్రభావం చూపుతుందన్నారు. అధికారులు వేగంగా స్పందించి ప్రజలకు, ప్రభుత్వానికి ఫలితాలు అందించేలా చూడాలన్నారు. నెక్ట్స్ మీటింగ్ నాకు అంతా ఇంప్రూవ్‌మెంట్ ఉండాల్సిందేనన్నారు. ఈ విషయంలో మంత్రులు కూడా కో-ఆర్డినేట్ చేసుకోవాలన్నారు.

 

Related News

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

Big Stories

Advertisement
×