RTC Driver: ఆర్టీసీ డ్రైవర్‌పై బస్సులో అందరూ చూస్తుండగానే ద్విచక్ర వాహనదారుడు అమానుషంగా దాడి చేశాడు. ఏపీ రాజధాని అమరావతిలో ఈ నెల 3న జరిగిన ఈ దారుణం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యేవరకు ప్రపంచానికి తెలియదు.
స్టీరింగ్‌పై నిలబడి డ్రైవర్‌పై దాడి
ఈనెల 3వ తేదీ సాయంత్రం అమరావతి నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెనుమాక దగ్గరకు రాగానే.. ముందు బైక్‌పై వెళ్తున్న పాగోలు దుర్గాప్రసాద్ బస్సుకు దారివ్వకుండా పదే పదే అడ్డుపడ్డాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ ఏసురాజు హారన్ కొట్టారు. అంతే.. బైక్‌ను రోడ్డు మధ్యలో అడ్డుగా పెట్టి బస్సెక్కాడు. స్టీరింగ్‌పై నిలబడి డ్రైవర్‌తో అత్యంత దారుణంగా దాడి చేశాడు. ప్రయాణికులు వారిస్తున్నా ఆగలేదు. చివరకు గట్టిగా నిలదీయడంతో బస్సు దిగి వెళ్లిపోయాడు. ఘటనపై అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు డ్రైవర్ ఏసురాజు. కానీ కేసు మాత్రం నమోదు కాలేదు. ఈ ఘటనను వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఆలస్యంగా నిద్రలేచిన పోలీసులు కేసు నమోదు చేశారు.
దాడి జరిగిన రోజే కేసు నమోదు చేశామంటున్న పోలీసులకు… ఇప్పటివరకు డ్రైవర్ గాయాలకు సంబంధించిన సర్టిఫికెటే అందలేదు. పైగా వీడియో దృశ్యాల ఆధారంగా త్వరలోనే పూర్తి చార్జిషీట్‌ను దాఖలు చేస్తామనడంపై విమర్శలు వస్తున్నాయి.
Also Read: తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి