E-Paper
Advertisement

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..
Advertisement

Rain Alert: వినాయక చవితి ముసురు మొదలైంది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లోని విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి.

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

వాయువ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆదివారం, సోమవారం ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది.

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు

Advertisement

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో బలమైన గాలితో పాటు పిడుగులు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. ​కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ప్రస్తుతం ​తీరం వెంట గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం అంచనా వేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఆది-సోమవారాల్లో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీం అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో యాదాద్రి – భోంగీర్, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, ఖమ్మంలో విస్తృతంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అంచనా వేసింది. మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ అంతటా విస్తృతంగా వర్షాలు పడతాయని వెల్లడించింది.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి కుమ్ముడే కుమ్ముడు

Advertisement

వరంగల్, హన్మకొండ, కాజీపేట మండలాల్లో ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. భారీ వర్షాల తర్వాత యాదాద్రి – భోంగీర్, మహబూబాబాద్, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, నల్గొండ (కట్టంగూర్)లో రానున్న రెండు గంటల్లో స్థిరంగా ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్‌లో వర్షాల తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం. తెల్లవారుజామును మూడు గంటల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుకుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాలలో భారీ వర్షాలు పడ్డాయి.ప్రస్తుతం అనేక చోట్ల స్థిరంగా వర్షం పడుతోంది. ఉదయం 8 గంటల వరకు ఓ మోస్తరు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది.

ALSO READ: పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

Related News

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

Big Stories

Advertisement
×