E-Paper
Advertisement

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?
Advertisement

Bheemili YCP: బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాసరావు.. వైసీపీకి గుడ్‌బై చెప్పాక.. ఉత్తరాంధ్రలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలకు కూడా  రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు.. ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు అసలు పోరు మొదలైంది. భీమిలి ఇన్‌చార్జి పదవి కోసం.. పోటీ పెరిగింది. ఎందుకంటే.. ఇది వైసీపీకి కీలక స్థానం. గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు 92 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనకు దీటైన నేత కావాలంటే.. బలమైన అభ్యర్థి తప్పనిసరి అని పార్టీ భావిస్తోంది. అందుకే ఇప్పుడు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. సీనియర్ నేతల నుంచి కిందిస్థాయి క్యాడర్ దాకా.. అందరూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రుల ద్వారా జగన్‌ను కలిసి ఛాన్స్ అడుగుతున్నట్లు సమాచారం.

భీమిలి కోసం ఆశావహుల క్యూ!

Advertisement

ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతల ఇళ్ల ముందు.. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి ఆశావహులు క్యూ కడుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కోసం పార్టీ సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతమంది ఆశావహుల్లో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిమీదే చర్చ నడుస్తోంది. మరి.. గంటా శ్రీనివాసరావుని ఢీకొట్టే నేత ఎవరు? జగన్ చూపు ఎవరిపై పడుతుంది? భీమిలి వైసీపీ కొత్త ఇన్‌చార్జి పేరు ప్రకటన కోసం.. ఉత్తరాంధ్ర అంతటా ఉత్కంఠ నెలకొంది.

Also Read: ట్రంప్ మాస్టర్ స్ట్రోక్.. భారతీయులకు బిగ్ షాక్!

Tags

Related News

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

Big Stories

Advertisement
×