BigTV English

MP Kesineni Nani : కేశినేని మరోసారి సంచలన కామెంట్స్.. బుద్ధా వెంకన్నకే వార్నింగ్ ఇచ్చారా?

MP Kesineni Nani : కేశినేని మరోసారి సంచలన కామెంట్స్.. బుద్ధా వెంకన్నకే వార్నింగ్ ఇచ్చారా?

MP Kesineni Nani : ఎంపీ కేశినేని నాని.. కామెంట్స్ కేశినేని నాని.. విజయవాడలో టీడీపీకి పెద్ద ఎసర్ట్.. కానీ, ఒక్కసారి ఆయన కామెంట్స్ పార్టీలో పెద్ద చర్చకే తెరలేపుతాయి. ఆయన వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతారా? లేకపోతే సొంతపార్టీలోని నేతలనే టార్గెట్ చేస్తారా? అనే చర్చకు దారి తీస్తాయి. నిన్న కేశినేని చేసిన కామెంట్స్ మరోసారి టాక్ ఆఫ్ విజయవాడ అయ్యాయి. విజయవాడ నుంచి తన కుటుంబం పోటీలో ఉండదని ఆయన తేల్చి చెప్పారు. వెస్ట్ నుంచి తన కుమార్తె పోటీ చేస్తుందన్న ప్రచారాన్ని ఖండించారు.


సంపాదన కోసమే కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్ గా మారిందని సంచలనవ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా ఉండకూడదని… టీడీపీ నుంచి వెళ్లిపోవాలని కొందరు అనుకుంటున్నారని ఆయన చెప్పారు. అయితే అలాంటి వారి ఆటలను సాగనివ్వనని కేశినేని వార్నింగ్ ఇచ్చారు. అక్రమ సంపాదనకు తాను వ్యతిరేకమని.. ఎవరైనా దోచుకోవాలని చూసినా వారి భరతం పడతానని గట్టిగా చెప్పారు. కాల్ మనీ , గుడి దగ్గర కొబ్బరిచిప్పలు అమ్ముకునేవారిని వెస్ట్ నియోజకవర్గ ప్రజలు ఆదరించరని అన్నారు. పోటీలో ఉండకపోయినా.. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ కాపలా కుక్కలా ఉంటానంటూ నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.

నాని కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారా? అని చర్చ నడుస్తోంది. ఓ వైపు చంద్రబాబుని, టీడీపీని ఆకాశమంత ఎత్తును పోల్చుతూనే.. మరోవైపు సొంతపార్టీలోనే కొందరిని కేశినేని టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తోంది. కేశినేని తమ్ముడు చిన్ని గత కొంతకాలంగా విజయవాడ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. చిన్ని యాక్టీవ్ అవ్వడం నానికి కాస్త ఇబ్బందికరంగా మారినట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి చిన్ని విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. విజయవాడ టీడీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో.. ఆయన సొంతపార్టీలోని ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారినే టార్గెట్ చేసి మాట్లాడారని బెజవాడ సర్కిల్స్ లో కొందరు చర్చించుకుంటున్నారు.


Related News

Heavy Rains in AP: బాబోయ్ .. కుమ్మేస్తున్న వానలు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

Pulivendula Politics: జగన్‌కు కూటమి కౌంటర్.. బాయ్ కాట్ కాదు, బావిలో పడండి

Jagan on Pulivendula: జగన్ ప్రెస్‌మీట్.. పుటేజ్ బయటపెడతారా? ఓటమిని అంగీకరించినట్టేనా?

AP Liquor Shops: మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త జీవో పూర్తి వివరాలు..

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Big Stories

×