Big Stories

MP Nandigam Suresh Fraud | బాపట్ల ఎంపీ అనుచరుడు మోసం చేశాడంటూ.. సిఎం జగన్‌కు ఫిర్యాదు!

MP Nandigam Suresh Fraud | గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రెహ్మాన్ అనే వ్యక్తి కుటుంబం ‘స్పందన’ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు రేపల్లె సన్నీ తమని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. రెండెళ్ల క్రితం రేపల్లె సన్ని తమ వద్ద రూ.25 లక్షలు అప్పుగా తీసుకొని ఇంతవరకు చెల్లించలేదని రెహ్మాన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

తెలిసిన వ్యక్తి కావడంతో ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు ఇచ్చామని రెహ్మాన్‌ తల్లి నజమున్నీసా వాపోయారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేక ఎంపీ నందిగం సురేశ్ వద్దకు వెళితే ఆ డబ్బులతో తనకు సంబంధం లేదని.. మరోసారి వస్తే జైల్లో పెట్టిస్తానని బెదిరించాడని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబానికి న్యాయం చేయాలని రెహ్మాన్ కుటుంబం ఒక బ్యానర్ ప్రదర్శించింది.

- Advertisement -

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News