E-Paper
Advertisement

Raghuramakrishnamraju Comments: జగన్‌పై రుసరుస.. అక్కడ రాకుండా స్కెచ్.. ఆయన వెనుక సీఎం?

Raghuramakrishnamraju Comments: జగన్‌పై రుసరుస.. అక్కడ రాకుండా స్కెచ్.. ఆయన వెనుక సీఎం?
Advertisement

Raghuramakrishnamraju Hot Comments on CM Jagan: ఏపీ సీఎం జగన్‌పై మరోమారు విరుచుకుపడ్డారు ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు. తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా వైసీపీ అధినేత భారీ స్కెచ్ వేశారని ఆరోపించారు. తాను లోక్‌సభకు వెళ్లినప్పుడు అలాంటి ఎత్తులు వేశారని, ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌కు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా ఉందన్నారు. పెళ్లికి వెళ్తే ఏడుస్తారని, చావుకు వెళ్తే నవ్వుతారంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు ఓ నాటకం వేసి అడ్డంగా దొరికిపోయారని మండిపడ్డారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ప్రచారంలో భాగంగా ఓ ఛానెల్‌తో మాట్లాడారు. తనను ఓడించడానికి ఇండిపెండింట్ అభ్యర్థి శివరామరాజుతో జగన్ చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శివరామరాజు పోటీ నామమాత్రంగానే ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే రామరాజు నుంచి తనకు సంపూర్ణ మద్దతు ఉందని, తన వెనుక అన్ని వ్యవహారాలను ఆయన చూస్తున్నారని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణంరాజు. ఉండి తన సొంతూరని, ఇక్కడి నుంచి విజయం సాధించడం ఖాయమన్నారు. పేరుకే వైసీపీ సర్కార్ అని, ఆంక్షల పేరుతో పథకాల్లో చాలామందికి కోత పెట్టిందన్నారు.

Advertisement

ఉండి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయన్న రఘురామకృష్ణంరాజు, ముఖ్యంగా సాగు, తాగు నీరు, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఆక్వా యూనివర్సిటీ ఇక్కడకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఉండి వచ్చినప్పుడు ఆక్వా సెక్టార్‌లోని రైతులకు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న సంబంధాలు కారణంగా తన నియోజకవర్గంలో సమస్యలకు చెక్ పెడతామన్నారు.

Also Read: భారీగా మనీ సీజ్, ఈసారి దాదాపు రెండున్నర కోట్లు

Advertisement

ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1982 నుంచి ఇప్పటివరకు వరుసగా టీడీపీ జెండా రెపరెపలాడింది. 1982 నుంచి 1999 వరకు రామచంద్రరాజు ఐదుసార్లు గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. 2009 నుంచి 2019 వరకు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈసారి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు బరిలో ఉన్నారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×