BigTV English

Pushpa 2 Copy: అరరే.. సుక్కు దొరికిపోయాడే.. పుష్ప రాజ్ బ్రాండ్ షర్ట్ ఐడియా కాపీనా..?

Pushpa 2 Copy: అరరే.. సుక్కు దొరికిపోయాడే.. పుష్ప రాజ్ బ్రాండ్ షర్ట్ ఐడియా కాపీనా..?

Kannada Director Claims Allu Arjun’s Pushpa 2 Movie Brand Shirt Idea is Copy: నిన్నటి నుంచి పుష్ప ఫీవర్ మొదలయ్యింది. పుష్ప పుష్ప.. పుష్పరాజ్ అంటూ వచ్చిన సాంగ్ మిలియన్ వ్యూస్ సాధించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ స్టెప్స్.. దేవిశ్రీ మ్యూజిక్.. ఇలా చెప్పుకుంటూ పోతే సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే మొదటినుంచి చెప్పుకుంటున్నట్లే సోషల్ మీడియా వచ్చాకా.. కాపీ అనే మాట ఎక్కువ వినిపించడం మొదలయ్యింది. ఏదైనా చిన్న సిమిలారిటీ కనిపించినా కూడా కాపీ అంటగట్టేస్తున్నారు.


తాజాగా పుష్పరాజ్ కు కూడా కాపీ మారక అంటుకుంది.పుష్ప క్లైమాక్స్ లో ఇది సార్ నా బ్రాండ్ అంటూ.. నా చేతి వేళ్ల ముద్రను వీపుపై రక్తంతో వేసిన పుష్ప.. ఆ బ్రాండ్ ను పుష్ప ది రూల్ లో కొనసాగించినట్లు సాంగ్ లో చూపించారు. ప్రతి కాస్ట్యూమ్ లో కూడా కూడా పుష్ప బ్రాండ్ కనిపించేలా జాగ్రత్త పడ్డారు. షర్ట్ వెనుక భాగంలో చేతిముద్రను ప్రింట్ చేయించుకొని తన బ్రాండ్ ఇది అని పుష్ప రాజ్ చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. నిన్న సాంగ్ లో చూసి సుకుమార్ ఐడియా సూపర్ .. అంటూ అందరూ ప్రశంసలు గుప్పించారు.

అయితే తాజాగా కన్నడ డైరెక్టర్.. ఇది నా సినిమా నుంచి కాపీ కొట్టారు అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కన్నడ డైరెక్టర్ ప్రేమ్.. 2005 లో జోగి ది కింగ్ అనే సినిమాను తెరకెక్కించాడు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇందులో హీరో కూడా.. పుష్ప లానే తన చేతి ముద్రను చొక్కాపై ప్రింట్ చేయించుకుంటాడు. అదే తన బ్రాండ్ అని చెప్పుకుంటాడు.


Also Read:Kubera Movie: నాగార్జున ‘కుబేర’ ఫస్ట్ లుక్ రిలీజ్.. అచ్చం ఆ సినిమాలాగే..!

ఇప్పుడు సుకుమార్.. ఈ ఐడియాను కాపీ కొట్టినట్లు డైరెక్టర్ ప్రేమ్ చెప్పుకొచ్చాడు. రెండు పోస్టర్లను మిక్స్ చేసి.. ప్రతి కళాఖండానికి దాని కాపీ ఉంటుంది అని రాసుకొచ్చాడు. అంటే.. పుష్ప.. జోగికి కాపీ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ విషయమై సుకుమార్ ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×