Big Stories

Police Seized Rs 2.40 Crores: ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రలో భారీగా మనీ సీజ్.. ఈసారి దాదాపు రెండున్నర కోట్లు..!

AP Police Seized Rs 2.40 Crores During Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో డబ్బు భారీగా పట్టుబడుతోంది. గడిచిన మూడురోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిసి ఆరు కోట్ల రూపాయలను సీజ్ చేశారు. తాజాగా ఇప్పుడు రెండు కోట్ల 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

- Advertisement -

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రెండుకోట్ల 40 లక్షల రూపాయలను పట్టుకున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండల జగన్నాథపురం గ్రామశివారులోని అంతర్ జిల్లాల చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. బ్యాగులను తనిఖీలు చేస్తుండగా మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేదు. దీంతో నగదును సీజ్ చేసిన పోలీసులు, ఎన్నికల అధికారి కార్యాలయానికి తరలించారు.

- Advertisement -

బుధవారం అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న ఓ కారులో దాదాపు రెండు కోట్ల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు. మనీ తరలిస్తున్న వాహనం టీడీపీ అభ్యర్థి కందికుంట వెంటక ప్రసాద్ పేరున ఉంది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ మొదలుపెట్టారు.

Also Read: అడ్డంగా దొరికిన టెక్కలి వైసీపీ అభ్యర్థి, దువ్వాడా.. మజాకా?

అంతకుముందు రోజు హైదరాబాద్‌లో దాదాపు ఎనిమిది చోట్ల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సోదాలు చేశారు పోలీసులు. దాదాపు కోటిన్నర పైగానే డబ్బు సీజ్ చేశారు. దీంతో తెలుగురాష్ట్రాల్లో గడిచిన మూడురోజుల్లో ఆరు కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ భారీ ఎత్తున నగదు పట్టుబడడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతరాష్ట్ర, జిల్లాల సరిహద్దులు, ప్రైవేటు ట్రావెల్ బస్సులు, కారులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం నియమించిన ప్లయింగ్ స్క్వాడ్‌లు సీసీ‌కెమెరాల ఆధారంగా విస్తృతంగా తనిఖీలు తీవ్రతరం చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News