E-Paper
Advertisement

AP Politics: జగన్‌పై ముద్రగడ కూతురు ఆగ్రహం.. ఇవేమి రాజకీయాలు, మా నాన్న కూడా అంతేనా?

AP Politics: జగన్‌పై ముద్రగడ కూతురు ఆగ్రహం.. ఇవేమి రాజకీయాలు, మా నాన్న కూడా అంతేనా?
Advertisement

AP Politics: తిరుమల లడ్డూ వ్యవహారం వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేసిందా? ఆ పార్టీ ఇప్పుడు ప్రకంపనలు రేగుతున్నాయా? కేవలం రాజకీయాలు నేతలు మాత్రమే కాదు, ప్రజలు కూడా వారిపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారా? ఆ పార్టీ తప్పు మీద తప్పు పదే పదే చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

జగన్‌ రాజకీయాలపై ముద్రగడ కూతురు ఆగ్రహం

Advertisement

తిరుమల లడ్డూ వ్యవహారం వైసీపీని ఓ కుదుపు కుదిపేస్తోంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం బయటకు రావడంతో ఆ పార్టీపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో జంతువుల కొవ్వు ఉందా? రసాయనాలతో చేశారా? అనేది కాసేపు పక్కన బెడదాం. ఈ వ్యవహారంలో రెచ్చిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్డంగా బుక్కయ్యారు.

దీంతో  వైసీపీ నేతలు ఆలోచనలో పడ్డారు. ఈ వ్యవహారంపై నోరు ఎత్తకుండా సైలెంట్ గా ఉండడమే బెటరని అంటున్నారు. లేకుంటే అంబటి పరిస్థితి తమకు వస్తుందని లోలోపల మధనపడుతున్నారు. ఈ వ్యవహారంపై ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి రియాక్ట్ అయ్యారు. జగన్ వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు. ఎక్స్ వేదికగా జగన్ ని ఏకిపారేశారు.

Advertisement

ఇవేమి రాజకీయాలు, మా నాన్న కూడా అంతేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయని రాసుకొచ్చారు క్రాంతి. ఈ విషయంలో జగన్ ప్రవర్తన భయంకరంగా ఉందన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ వ్యవహారంపై ఎండగట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి రెడ్లకు అప్పగించలేదా? అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా?

అంబటి రాంబాబుని వాడుకుని ఏ విధంగా అల్లర్లు చేయాలని చూస్తున్నారో,అదే విధంగా రేపు నాన్నని వాడుకుని బలి పశువుని చెయ్యరన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. తిరుమల లడ్డూ విషయంలో నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొందని, అసలేమీ జరగలేదని ముద్రగడ ఎలా చెబుతున్నారో అర్థం కాలేదన్నారు.

ALSO READ: నేరగాళ్లకు టెన్షన్.. రోబో ‘అర్జున్‌’ కంట్లో పడితే మటాష్.. 

గతంలో ముద్రగడ చిత్తశుద్ధితో చేసిన ఉద్యమాన్ని ఆయనకు తెలియకుండానే వైసీపీ వాళ్ళు తమకు అనుకూలంగా మలచుకుని అధికారంలోకి వచ్చారన్నారు. ఆయన ఉద్యమ ఫలితంగా కాపులను EBC కోటాలో 5 శాతం రిజర్వేషన్లు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఇస్తే.. జగన్ అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేయలేదా? అంటూ ప్రశ్నించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందన్నారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. గతంలో చేసిన అరాచకాల వల్ల 151 సీట్ల నుంచి 11 కి పడిపోయారని దుయ్యబట్టారు. ఇదే రకంగా వెళ్తే వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గ్రహించాలని ముగించారు.

Related News

స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీలో కీలక మార్పులు.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, బొత్సకు చెక్

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×