BigTV English

Bhuvaneswari comments on jagan govt: డేంజర్‌లో రాష్ట్ర భవిష్యత్తు, యువత మేలుకోవాలన్న భువనేశ్వరి

Bhuvaneswari comments on jagan govt: డేంజర్‌లో రాష్ట్ర భవిష్యత్తు, యువత మేలుకోవాలన్న భువనేశ్వరి

Bhuvaneswari comments on Jagan govt(AP elections news): వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు వైఫ్ భువనేశ్వరి. రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. వైసీపీ ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు అనే ఆయుధంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆ పార్టీ నేతలు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇసుక, మద్యం, గంజాయి, మట్టి దోపిడీలతో నేతలు తమతమ జేబులను నింపుకున్నారని మండిపడ్డారు.


రెండురోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం రోడ్ షోలో పాల్గొన్నా రు. వైసీపీ పాలనను ఎండగట్టారు నారా భువనేశ్వరి. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ యాక్ట్ గురించి వివరించారు. మన భూములను ప్రభుత్వం లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోవడం అలవాటుగా పెట్టుకున్న సీఎం జగన్, ప్రజల భూములను కాజేసేందుకు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు.

ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ ప్రభుత్వం మన నెత్తి మీద చేయి పెట్టిందన్నారు నారా భువనేశ్వరి. పాలనను ప్రశ్నించినందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చాలా మందిని జైలుకు పంపడమేకాదు, హత్యలకు తెగబడ్డారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలకు మద్దతుగా పోరాడుతున్న టీడీపీకి మద్దతు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయాలన్నారు. భువనేశ్వరి వెంట ఆమె సోదరుడు రామకృష్ణ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×