Big Stories

BIG Shock To CM Jagan: కంచుకోటలో బీటలు.. జగన్ కు గండం

BIG Shock To CM Jagan in Kadapa Assembly constituency: సీఎం జగన్ ఇలాకాలో వైసీపీ కంచుకోట బీటలు వారనుందా?  వివిధ నియోజకవర్గాల్లో అధికారపక్షానికి ఎదురుగాలి వీస్తుందా? మరి కొన్ని సెగ్మెంట్లో వైసీపీ అభ్యర్ధులు చెమటోడ్చాల్సి వస్తుందా? ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే ఔననే సమాధానం వస్తుంది. గతానికి భిన్నంగా ఇప్పుడు పలు నియోజకవర్గాల ప్రజల ఆలోచనల్లో మార్పు కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయా పార్టీల అంతర్గత సర్వేలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయంట. అందుకే వైసీపీ నేతలు చివరి అస్త్రంగా డబ్బు వెదజల్లే పనిలో పడ్డారంట.

- Advertisement -

సీఎం సొంత జిల్లా కడపలో ప్రజలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. పబ్లిక్ వాయిస్ వింటుంటే కడప, మైదుకూరు , పొద్దుటూరుల్లో కొంత మొగ్గు తెలుగుదేశం వైపే ఉందంటున్నారు. కమలాపురం, జమ్మలమడుగుల్లో హోరాహోరీ పోరు తప్పదంటున్నారు.. బద్వేల్‌లో కొంతమేర వైసీపీకే మొగ్గు కనిపిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ కూడా ఇక్కడ బరిలో దిగడంతో మైనారిటీ ఓట్లు కొంతమేర చీలే అవకాశాలు ఉన్నాయి. కడపలో ముస్లీం ఓటర్లు నిర్ణయాత్మకశక్తులుగా ఉన్నారు. వారి మొగ్గు ఎటు ఉంటే ఆ పార్టీదే విజయం అని చెప్పవచ్చు.

- Advertisement -

కడప నియోజకవర్గంలో ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థి మాధవి రెడ్డికి అక్కడ పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. వైసిపి తరఫున డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే అంజాద్ భాషా వరసగా రెండుసార్లు గెలిచి మూడోసారి బరిలో ఉన్నారు. ఆయన పై తీవ్ర వ్యతిరేకత ఉంది. పలు సందర్భాల్లో అది బహిర్గతమైంది. అభివృద్ధిని కాలికి వదిలేశారని. సమస్యల్ని పట్టించుకోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పెద్ద దర్గా పరిధిలోని ఓ కాలనీలలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ముస్లిం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Also Read: మోడీ ధమ్కీ! జగన్ తుస్!!

కడపలో కాంగ్రెస్ అభ్యర్థి అబ్జల్ ఖాన్ ముస్లిం ఓట్లను భారీగా చీల్చే పరిస్థితి ఎదురవుతుంది. నాయకుడు హిందువా ముస్లిమా క్రిస్టియన అనేది కాదు మంచి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తారు. ముఖ్యంగా సమస్యలు ఉన్నాయని వెళితే అంజాద్ భాష ఎప్పుడు పట్టించుకోలేదు అనే ఆరోపణలు ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. ఇక ఇసుక అక్రమంగా తరలించడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు తాగునీటి అందించడంపై ఏనాడూ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న విద్యా దీవెన నగదు తమకు సక్రమంగా అందలేదని అంటున్నారు నగరవాసులు.

పొద్దుటూరులో టీడీపీ అభ్యర్ధిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై సానుభూతి కనిపిస్తుంది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మూడో సారి పోటీ చేస్తున్నారు. బీసీ ఓటర్లు కీలకంగా ఉంటే ఆ సెగ్మెంట్లో టీడీపీ బీసీ నేత నందం సుబ్బయ్య హత్య ఆ వర్గీయుల్లో వైసీపీపై వ్యతిరేకత పెంచిందంటున్నారు. ఇసుక మాఫియా, క్రికెట్ బెట్టింగ్‌ ఇలా దేన్ని వదలకుండా రాచమల్లు దోచుకున్నారని.. అభివృద్దిని మాత్ర పట్టించుకోలేదని స్థానికులు ఓపెన్‌గానే చెప్తున్నారు. మరోవైపు బంగారు అంగళ్ల వ్యవహారం, తాత్కాలిక మార్కెట్లో గదులు కేటాయింపులకు సంబందించి వసూళ్లు, బినామీ పేర్లతో చర్చి భూములు కొనుగోలు వంటి అంశాలతో ఆయా వర్గాల వారు ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకతతో కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి గమనించే రాచమల్లు ప్రలోభాలపర్వానికి తెరలేపుతున్నారంట.

కమలాపురం నియోజకవర్గం నుంచి జగన్ మేనమామ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి మూడోసారి బరిలో దిగారు. గత రెండుసార్లుగా గెలిపించుకున్నా.. ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ సారి రవీంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అభ్యర్ధి పుత్త చైతన్యరెడ్డి గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే అక్కడ ఎవరి నోట విన్నా పోరు హోరాహోరీ అనే మాటలు వినిపిస్తున్నాయట. రవీంద్రనాథ్ రెడ్డి పై అవినీతి ఆరోపణల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువ చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  మరి సొంత జిల్లాలో ఈ పరిస్థితిని జగన్ ఎలా చక్కబెట్టుకుంటారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News