BigTV English

Simbu – New Thug In Town: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ నుంచి శింబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్.. మాస్ యాక్షన్ మామూలుగా లేదు

Simbu – New Thug In Town: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ నుంచి శింబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్.. మాస్ యాక్షన్ మామూలుగా లేదు

Simbu First Look in Thug life(Film news in telugu today): విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న కొత్త సినిమా ‘థగ్ లైఫ్’. ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానిగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ తాజాగా అందించారు.


ఇందులో భాగంగా థగ్ లైఫ్ నుండి నటుడు సిలంబరసన్ (శింబు) ఫస్ట్ లుక్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రూపంలో విడుదల చేశారు. 40 సెకన్ల నిడివితో రిలీజ్ అయిన ఈ టీజర్‌లో.. మొదటిగా ఎడారి ఇసుక తిన్నెలపై సిలంబరసన్ బోర్డర్ పెట్రోలియం కారు నడుపుతూ కనిపించాడు. అలా స్పీడ్‌గా వస్తున్న క్రమంలో ఒక్క సారిగా సడెన్ బ్రేక్ వేసి కారును స్కిడ్ చేశాడు.

ఆ తర్వాత అతడి లుక్‌ను రివీల్ చేశారు. కారులోంచి గన్ చూపిస్తూ కనిపించిన శింబు లుక్ అద్భుతంగా ఉంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే మొదట ఈ పాత్రలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్‌తో శింబు నటిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది.


Also Read: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ నుంచి క్రేజీ అప్డేట్.. వీడియో రిలీజ్

కాగా శింబు ఈ సినిమాలో కమల్ హాసన్ కొడుకుగా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. థగ్ లైఫ్‌లో భాగమైన ఇతరులలో త్రిష, జోజు జార్జ్, గౌతం కార్తీక్, ఐశ్వర్య లక్ష్మి, నాజర్, అభిరామి, ఇతరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. నివేదికల ప్రకారం.. విన్నైతాండి వరువాయా తర్వాత త్రిష, శింబు ‘థగ్ లైఫ్‌’ మూవీలో జంటగా నటిస్తున్నారు.

థగ్ లైఫ్ క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ చిత్రం. నాయకన్ తర్వాత కమల్, మణిరత్నంల కలయికలో ఇది తెరకెక్కుతోంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ చిత్రం నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు ఈ మూవీ పూర్తి స్వింగ్‌లో పునఃప్రారంభించబడింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. థగ్ లైఫ్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×