E-Paper
Advertisement

Nara Lokesh Speech: బాబు సూపర్ సిక్స్ హామీలను జనంలో తీసుకెళ్లండి.. శ్రీకాకుళం శంఖారావంలో లోకేశ్ పిలుపు..

Nara Lokesh Speech: బాబు సూపర్ సిక్స్ హామీలను జనంలో తీసుకెళ్లండి.. శ్రీకాకుళం శంఖారావంలో లోకేశ్ పిలుపు..
Nara Lokesh Public Meeting At Srikakulam

Nara Lokesh Public Meeting At Srikakulam(AP politics): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రెండోరోజు నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస నియోజకవర్గాల్లో పర్యటన చేపట్టారు. శ్రీకాకుళంలో నిర్వహించిన శంఖారావం సభలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్రలో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ ఆక్రమిస్తున్నారని వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారు. రామతీర్థంలో జరిరిగిన ఘటనపై జగన్ సర్కార్ అసలు పట్టించుకోలేదన్నారు.

ఉత్తరాంధ్రకు జగన్ ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చార? అని లోకేశ్ ప్రశ్నించారు. రైల్వే జోన్‌కు అవసరమైన భూములు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీకి 31 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు. కేసుల మాఫీ కోసం ఎంపీలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు.

Read More: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

మరో రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు వైసీపీ పాలనలో జరిగిన ఆక్రమాలపై విచారణ జరిపిస్తామని స్పష్టంచేశారు. విశాఖపట్నంలో రూ. 500 కోట్లతో సీఎం వైఎస్ జగన్ ప్యాలెస్ కట్టుకుంటున్నారని తెలిపారు. తాడేపల్లి గేట్లు బద్దలయ్యే సమయం ఆసన్నమైందని తేల్చిచెప్పారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఏం చేశామో వైట్ పేపర్ రిలీజ్ చేస్తామన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.

టీడీపీ నేతలపై కేసులపై కేసులు పెడుతున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. ఎలాంటి తప్పుచేయకపోయినా చంద్రబాబును జైలులో పెట్టారని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ప్రస్తావించారు. బాబాయ్‌ను చంపింది ఎవరు? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో అంత బాదుడే బాదుడే అని విమర్శించారు. పన్నులు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు.

ఓటమి ఖాయమని తేలడంతో జగన్ కొత్త స్కీమ్ తీసుకొచ్చారని నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ఒక నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను మరో చోట పోటీ చేయిస్తున్నారని అన్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×