Big Stories

AP DSC Notification Released: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

DSC Notification Released in AP

DSC Notification Released In AP(AP latest news): ఏపీలో నిరుద్యోగులు ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మొత్తం 6,100 పోస్టులకుగాను ఎస్జీటి పోస్టులు 2,280 ఉండగా.. స్కూల్‌ అసిస్టెంట్‌ 2,299; టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్‌ 42 ఉద్యోగాలు చొప్పున భర్తీ చేయనున్నారు.

- Advertisement -

డీఎస్సీకి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. మార్చి 5 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పరీక్షలు మార్చి 15 నుంచి 30 వరకు జరగనున్నాయి.

- Advertisement -

Read More: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వయోపరిమితిపై నోటిఫికేషన్‌కు జీఓ

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు సెషన్ 1 నిర్వహించనున్నారు. సెషన్ 2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది.

డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఏప్రిల్ 1 వరకు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2న తుది కీ విడుదల చేసి.. ఏప్రిల్ 7న ఫలితాలు వెళ్లడించనున్నారు.

ఈ నేపథ్యంలో 2018 సిలబస్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరగనునట్లు తెలిపారు. పూర్తి వివరాలు apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు. జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌ కేటగిరి అభ్యర్థులకు మాత్రం మరో ఐదేళ్లు పెంచారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News