BigTV English

Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత.. నారా లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు

Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత.. నారా లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు

Nara Lokesh: టీడీపీ నేత నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రం 14వ రోజు కొనసాగుతోంది. పెద్ద ఎత్తున అభిమానులు యాత్రలో పాల్గొని లోకేష్‌కు మద్ధతు పలుకుతున్నారు. పాదయాత్ర చిత్తూరు జిల్లా గంగాధర మండలం సంసిరెడ్డిపల్లికి రాగానే గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.


ఈక్రమంలో పోలీసులు నారా లోకేష్‌‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. లోకేష్ స్టూలుపై నిల్చొని ప్రజలనుద్దేశించి మాట్లాడుతుండగా అడ్డుకొని స్టూల్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పోలీసులపై తీరుపై నారాలోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూలుపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని చూపిస్తూ.. కొందరు పోలీసుల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. తమది అంబేద్కర్ రాజ్యాంగమని.. తమని అడ్డుకొమ్మంటున్న కొందరి సొంత రాజ్యాంగంతో పనిలేదని అన్నారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×