BigTV English

IND Vs AUS : నాగ్ పూర్ టెస్టులో భారత్ బౌలర్లు భళా.. కుప్పకూలిన ఆసీస్..

IND Vs AUS : నాగ్ పూర్ టెస్టులో భారత్ బౌలర్లు భళా.. కుప్పకూలిన ఆసీస్..

IND Vs AUS : ఆస్ట్రేలియాతో నాగ్ పూర్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ బౌలర్లు చెలరేగారు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. తన తొలి ఓవర్ తొలి బంతికే ఆసీస్ కు మహమ్మద్ సిరాజ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికి షమి బౌల్డ్ చేయడంతో మరో ఓపెనర్ డెవిడ్ వార్నర్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే లంచ్ లోపు మరో వికెట్ పడకుండా మార్నస్ లబుషేన్ , స్టివ్ స్మిత్ అడ్డుకున్నారు. దీంతో లంచ్ విరామ సమాయానికి ఆసీస్ రెండు వికెట్లు నష్టానికి 76 పరుగులు చేసింది.


స్పిన్నర్లు తిప్పేశారు..
లంచ్ తర్వాత భారత్ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. తొలుత పేసర్లు షాకిస్తే ఈసారి స్పినర్లు ఆసీస్ బ్యాటర్ల పనిపట్టారు. ఆసీస్ స్కోర్ 84 పరుగుల వద్ద లబుషేన్ ( 49) అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుట్ అయ్యాడు. లబుషేన్ ను జడేజా బౌలింగ్ లో కీపర్ కేఎస్ భరత్ స్టంప్ చేశాడు. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న భరత్ కు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. అదే స్కోర్ వద్ద మ్యాట్ రెన్షాను జడేజా డకౌట్ చేశాడు. ఈ రెండు వికెట్లు వరుస బంతుల్లో పడ్డాయి. ఆసీస్ స్కోర్ 109 పరుగుల వద్ద స్టివ్ స్మిత్ ( 37)ను జడేజా బౌల్డ్ చేయడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది.

కీపర్ అలెక్స్ క్యారీ ( 36) దాటిగా ఆడేందుకు ప్రయత్నించగా అశ్విన్ బోల్తా కొట్టించాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తొలి టెస్టు ఆడుతున్న టాడ్ మర్ఫీ ( డకౌట్) జడేజాకు చిక్కాడు. దీంతో ఆసీస్ 173 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. చాలాసేపు క్రీజులో నిలబడిన పీటర్ హాండ్స్ కాంబ్ ( 31) ను జడేజా అవుట్ చేశాడు. ఇక అశ్విన్ చివరి వికెట్ తీయడంతో ఆసీస్ 177 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది.


భారత్ బౌలర్లలో జడేజా 5 , అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. షమీ, సిరాజ్ కు తలో వికెట్ దక్కింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×