Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మండన్న ఎంతో చలాకీ ఉంటుంది. తాను నటించిన సినిమాల ప్రమోషన్ వీవెంట్స్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంది. అందుకే ఆయా మూవీల్లోని సాంగ్స్ బీట్స్ కు స్టేజ్ రష్మిక చేసే డాన్స్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతాయి. ఎంతో ఉషారుగా ఉండే రష్మిక అనారోగ్యం బారిన పడిందా? ఆమెకు ఏదైనా వ్యాధి సోకిందా? ఈ వార్తలే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రష్మిక ఇన్ స్టా లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ కన్నడ భామ తన వ్యక్తి విషయాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడిస్తోంది. రీసెంట్ గా డే షెడ్యూల్‌ను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ‘‘డియర్ డైరీ.. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్‌గా గడిచింది. లేవగానే కార్డియో వర్క్ అవుట్ చేశా. ఆ తర్వాత ఆహారం తీసుకున్నా. రేపటి షెడ్యూల్ కోసం బ్యాగ్ సర్దుకున్నా. డెర్మట్.. అపాయింట్‌మెంట్ తీసుకున్నా. ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. కానీ అది క్యాన్సిల్ అయ్యింది. తిరిగి ఇంటికి వచ్చేశా. ఇక గుడ్ నైట్. బాగా పడుకో’’ అంటూ హార్ట్ ఎమోజీలను తన పోస్ట్ కు జత చేసింది రష్మిక.
రష్మిక చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో డెర్మట్ అంటే ఏంటని సోషల్ మీడియా యూజర్లు మీనింగ్ కోసం వెతకటం మొదలుపెట్టారు. డెర్మట్ అంటే డెర్మటాలజిస్ట్ అని చాలామంది దానికి అర్థం చెప్పారు. దీంతో అప్పటి నుంచి రష్మికకు చర్మ వ్యాధి సోకిందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్‌గా మయోసైటిస్ బారిన పడటం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ వ్యాధి నుంచి సామ్ కోలుకుంది. గతంలో చాలామంది హీరోయిన్లు భయంకరమైన వ్యాధుల బారిన పడి తర్వాత కోలుకున్నారు. ఇప్పుడు రష్మిక చేసిన పోస్ట్ తో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఆమెకు ఏదైనా చర్మ వ్యాధి సోకిందా? ఎందుకు డెర్మటాలజిస్ట్ అపాయింట్‌మెంట్ తీసుకుందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రష్మిక తెలుగులో పుష్ప-2, హిందీలో యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల తమిళ హీరో విజయ్ సరసన వారసుడు చిత్రంలో నటించింది. తమిళ, తెలుగు భాషల్లో ఈ మూవీ విడుదలైంది. ఏది ఏమైనా తనకు వ్యాధి సోకిందో లేదో రష్మిక క్లారిటీ ఇస్తేనే అసలు విషయం తెలుస్తుంది.