E-Paper
Advertisement

Neerabh Kumar as AP New CS: ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ నియామకం.. ఉత్తర్వులు జారీ!

Neerabh Kumar as AP New CS: ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ నియామకం.. ఉత్తర్వులు జారీ!
Advertisement

Nirabh Kumar Prasad as New Chief Secretary to AP Government: ఏపీలో సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో నూతన సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్ రేసులో పలువురు సీనియర్ IASలు ఉన్నప్పటికీ.. నీరభ్ కుమార్, విజయానంద్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. వీరిద్దరూ చంద్రబాబు కోటరీలో గతంలో పనిచేసిన వారే.

ఇద్దరూ చంద్రబాబుకు సన్నిహితులే కావడంతో.. సీనియారిటీ ఆధారంగా 1987 బ్యాచ్ IAS అధికారి నీరబ్ కుమార్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు పూర్తి టీమ్ ను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Advertisement

నీరభ్ కుమార్ 2014 నుంచి 2019 చంద్రబాబు ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నారు. ఇప్పటిదాకా సీఎస్ గా కొనసాగిన జవహర్ రెడ్డి నిన్నటి నుంచి సెలవుపై వెళ్లారు. ఆయన ఈనెలాఖరులోగా పదవీ విరమణ చేయనున్నారు.

Also Read: మోదీ కేబినెట్‌లోకి టీడీపీ, కొత్త ఫార్ములా అప్లై..

Advertisement

కాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో.. సీఎంవో ఎవరనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

Big Stories

Advertisement
×