BigTV English

Best Smartphones Under Rs 10,000: పిచ్చెక్కించే రూ.10 వేల లోపు ఫోన్లు.. కెమెరా, ఫీచర్లు అద్భుతం!

Best Smartphones Under Rs 10,000: పిచ్చెక్కించే రూ.10 వేల లోపు ఫోన్లు.. కెమెరా, ఫీచర్లు అద్భుతం!

Best Smartphones Under Rs 10,000 Only: టెక్ కంపెనీలు తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల విపరీతంగా పెంచాయి. ప్రస్తుత రోజుల్లో రూ. 10,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన కెమెరాలు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో వస్తున్నాయి. అంతేకాకుండా అవి బ్రహ్మాండమైన డిజైన్‌లు, శక్తివంతమైన ప్రాసెసర్‌లను కూడా కలిగి ఉన్నాయి.


దీనివల్ల సామాన్య కస్టమర్లకు ఇవి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఎందుకంటే బడా కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను అధిక ధరలో లాంచ్ చేస్తున్నాయి. అందువల్ల సామాన్యులు స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచన ఉన్నా.. తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు. ఇక రూ.10 వేలలో లభించే ఫోన్లు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి రూ. 10,000లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇక్కడ మంచి ఆప్షన్‌లు అందుబాటులో ఉ్ననాయి.

Redmi a3


రెడ్ మి ఏ3 స్మార్ట్‌ఫోన్ ఇటీవలే లాంచ్‌ అయింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే అమెజాన్‌లో కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.9,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.6,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ. 6,600 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అమెజాన్ అందిస్తోంది. ఇది మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. 6.71-అంగుళాల HD+ 90Hz డిస్ప్లేతో వస్తుంది. 10W ఛార్జర్‌తో రవాణా చేయబడే 5000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఇది వెనుకవైపు 8MP AI డ్యూయల్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

Also Read: రూ.10 వేలలోపు లభించే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. వదలొద్దు మావా..

Samsung Galaxy M14

అమెజాన్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం14 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.8,999 ధరకు అందుబాటులో ఉంది. Samsung Galaxy M14 4G 4GB/64GB వేరియంట్‌ ఈ ధరకి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల LCD ఫుల్ HD+ డిస్‌ప్లేతో 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

ఇది వెనుకవైపు 50MP + 2MP + 2MP కెమెరా సెటప్, ముందు భాగంలో 13MO కెమెరాను కలిగి ఉంది. Qualcomm Snapdragon 680 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. Android 13-ఆధారిత One UI 5.1ని నడుపుతుంది. ఇది 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. 2 Gen. OS Upgrade & 4 Year సెక్యూరిటీ అప్డేట్‌తో వస్తుంది.

Also Read: Vijay Sales Mind Blowing Offers: భయ్యా ఇదేంది భయ్యా.. ఐఫోన్లు, వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు.. రచ్చ రచ్చే!

TECNO POP 8 

టెక్నో పాప్ 8 స్మార్ట్‌ఫోన్ కూడా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇది రూ. 6,899 ధరకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా రూ.6,550 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల LCD ఫుల్ HD+ డిస్‌ప్లేతో 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 8GB RAM, 64GB స్టోరేజ్‌ను కలిగి ఉంది.

ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో వెనుకవైపు 12MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీంతో పాటు మరెన్నో స్మార్ట్‌ఫోన్లు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×