E-Paper
Advertisement

Sajjala Ramakrishna: కాకరేపుతున్న సజ్జల తాజా కామెంట్స్.. ఏపీలో మరోసారి..

Sajjala Ramakrishna: కాకరేపుతున్న సజ్జల తాజా కామెంట్స్.. ఏపీలో మరోసారి..
Advertisement

Sajjala Ramakrishna Reddy comments(Political news in AP): ఏపీ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ సమయంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అంతే కాకుండా కౌంటింగ్ సమయంలో ప్రత్యర్థుల ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహంచారు. ఈ సమావేశానికి సజ్జల హాజరయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అవతలి పార్టీ ఆటలు సాగనివ్వద్దని తెలిపారు. మరో సారి ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని అన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదని తెలిపారు.

Advertisement

ఇదిలా ఉంటే..చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కు మెయిల్ ద్వారా వైసీపీ రిక్వెస్ట్ పంపించింది. వైసీపీ రాజ్య సభ సభ్యులు నిరంజన్ రెడ్డి ఈ మెయిల్ పంపించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల 25 న ఇచ్చిన నిబంధనలు గతంలో ఇచ్చిన వాటికి విరుద్దంగా ఉన్నాయని తెలిపారు. అటెస్టిండ్ ఆఫీసర్ స్పెసిమెన్ సిగ్నీచర్ తీసుకోవడం ఈసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

Also Read: విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు, రేపో మాపో విజయవాడకు..

Advertisement

కొత్త  నిబంధనల వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించారు. దీంతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సమగ్రతను కాపాడేందుకు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నామని ఎన్నికల కమిషన్ ను కోరారు

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×