E-Paper
Advertisement

Parthasarathy : వైసీపీలో మరో వికెట్‌ డౌన్.. చంద్రబాబుతో పార్థసారథి భేటీ..

Parthasarathy :వైసీపీలో మరో వికెట్‌ పడబోతోంది. ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని వీడబోతున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసిన పార్థసారథి… టీడీపీలో చేరే అంశంపై చర్చించారు. ఇటీవల జగన్‌పై పార్థసారథి విమర్శలు చేయడంతో… పార్టీ అధిష్టానం వివరణ కోరింది. మారిన పరిణామాలతో చంద్రబాబును కలిసిన పార్థసారథి… టీడీపీలో చేరేందుకు లైన్‌ క్లియర్ చేసుకున్నారు.

Parthasarathy : వైసీపీలో మరో వికెట్‌ డౌన్.. చంద్రబాబుతో పార్థసారథి భేటీ..
Advertisement

Parthasarathy : వైసీపీలో మరో వికెట్‌ పడబోతోంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని వీడబోతున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసిన పార్థసారథి.. టీడీపీలో చేరే అంశంపై చర్చించారు. ఇటీవల జగన్‌పై పార్థసారథి విమర్శలు చేయడంతో.. పార్టీ అధిష్టానం వివరణ కోరింది. మారిన పరిణామాలతో చంద్రబాబును కలిసిన పార్థసారథి.. టీడీపీలో చేరేందుకు లైన్‌ క్లియర్ చేసుకున్నారు.

ఏపీలోని ప్రధాన పార్టీల్లో టికెట్ల గోల ఇలా పీక్స్‌కు చేరింది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ రెండూ కూడా అభ్యర్థులను ఖరారు చేసేందుకు సర్వేలపైనే ఆధారపడ్డాయి. ఇప్పటికే ఇంచార్జ్‌ల మార్పుతో రెండు లిస్ట్‌లను ప్రకటించిన అధికార వైసీపీలో అసంతృప్త జ్వాలలు పీక్స్‌కు చేరాయి. అనేక మంది నేతలు జెండా ఎత్తేసి టీడీపీ పంచన చేరిపోయారు.మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మూడో లిస్ట్‌ కోసం నరాలు తెగె ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు నేతలు.

Advertisement

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి పిలుపు వస్తుందంటే చాలు వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణయాదవ్, సి.రామచంద్రయ్య, క్రికెటర్ అంబటి రాయుడు పార్టీని వదిలి వెళ్లిపోయారు. మరోవైపు తన సీటు మారిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటున్నారు నర్సరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అయితే అదే సీట్ కోసం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పట్టుపడుతున్నారు. ఒకవేళ టికెట్ దక్కకపోతే ఆయన జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా టిక్కెట్ దక్కదంటే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్థసారథి పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

అటు విపక్ష టీడీపీలోనూ సీట్లు ప్రకటించకముందే ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటించేశారు. లిస్ట్‌లో తమ పేర్ల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ టికెట్ దక్కకపోతే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు కొందరు నేతలు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×