Bhatti Vikramarka : బడ్జెట్ అంచనాలకే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో భట్టి విక్రమార్క పర్యటించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు.
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామని భట్టి విక్రమార్క చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రంలో సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. పూర్తిస్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని భట్టి తెలిపారు. బడ్జెట్ అంచనాల కోసమే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.