E-Paper
Advertisement

Pawan Vs Roja: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఇష్యూ.. ప్రత్యేక బోర్డు కావాలన్న పవన్, డ్రామాలొద్దన్న రోజా

Pawan Vs Roja: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఇష్యూ.. ప్రత్యేక బోర్డు కావాలన్న పవన్, డ్రామాలొద్దన్న రోజా
Advertisement

Pawan Vs Roja: తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయా? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఎందుకు వైసీపీ తప్పుబడుతోంది?  సనాతర ధర్మం పరిరక్షణకు బోర్డు ఏర్పాటు అవసరం లేదా? వైసీపీ నేతలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఈ విషయంలో మాజీ మంత్రి రోజు ఎందుకు అంత మాటన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం

Advertisement

తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ నిజమేనని తేలింది. సీబీఐ సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రూ. 250 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యిని బోలేబాబా డెయిరీ సరఫరా చేసినట్టు తేల్చింది. ఈ వ్యవహారంపై గడిచిన రెండురోజులు అధికార కూటమి-విపక్ష వైసీపీ మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది.

ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. సనాతర ధర్మం పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడానికి సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ పవిత్రమైన పుణ్యక్షేత్రమన్నారు.

Advertisement

పవన్ కొత్త పల్లవి..  వైసీపీ ఆగ్రహం

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం కేవలం మిఠాయి కాదని, హిందువుల భావోద్వేగమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు వైఫల్యాలు, అనైతిక చర్యలు వల్ల తిరుమల పవిత్రతను దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా వరుసగా రాసుకొచ్చారు.  కూటమి ఆలోచనలను పసిగట్టిన వైసీపీ, వెంటనే  ఆ పార్టీలు నేతలు రియాక్ట్ అయ్యారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యి కల్తీ అంటూ కూటమి ప్రభుత్వం తల తోకా లేని ఆరోపణలు చేస్తోందన్నారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.

ALSO READ:  తెలుగు రాష్ట్రాల్లో చంపేస్తున్న చలి..  సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు 

నిజంగా ఆధారాలు ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆధారాల కోసం సిట్ దర్యాప్తు చేస్తోందని, ఇక కంగారు పడాల్సిన అవసరం లేదన్నది టీడీపీ నేతల మాట. రేపోమాపో మరికొందరికి సిట్ నుంచి పిలుపు రావడం ఖాయమని అంటున్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సనాతన ధర్మం గురించి మాట్లాడటం కేవలం రాజకీయ నటన మాత్రమేనని, అందులో ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. పవిత్రత, ధర్మం గురించి మాట్లాడిన ప్రతీసారి ఆయన పక్షపాత వైఖరి స్పష్టంగా బయటపడు తుందన్నారు. తిరుమలలో భక్తులు చనిపోయినప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నది ఆమె ప్రశ్న. సీఎం చంద్రబాబుకు రక్షణ కవచం అవసరమైనప్పుడు ఇలాంటి ప్రవచనాలు వస్తాయని తూర్పారబట్టారు.

ఒక్కమాటలో చెప్పాలంటే దీన్ని భక్తి అని అనరని, స్వచ్ఛమైన రాజకీయ నటనని వ్యాఖ్యానించారు. తిరుమల సమస్యలు ఒక బోర్డు లేదా కమిటీ పరిష్కరించవని అన్నారు. కేవలం చిత్తశుద్ధి, నిజాయితీ మాత్రమే పరిష్కారం చూపుతాయన్నారు. మరి రోజా వ్యాఖ్యలపై జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×