Winter Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. చలి స్టార్టింగ్‌లోనే ఇంత చలి ఉంటే తర్వాత ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో తొమ్మిది నుంచి పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి వణికి పోతున్నారు. ఉదయం సమయంలో పొగమంచు, చలిగాలులు వీస్తుండగా.. రాత్రి సమయంలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నవంబర్ నెలలో 13 నుండి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న మూడు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో పలు జిల్లాల్లో చలి పులి వణికిస్తోంది.
తెలంగాణలోని ఆదిలాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హయత్ నగర్, పటాన్ చెరు, హైదరాబాద్, దుండిగల్, మహబూబ్ నగర్, రాజేంద్రనగర్, ఖమ్మం, హకీమ్ పేట్, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే మిగత జిల్లాల్లో కొంచెం తక్కువగా ఉంటుందని తెలిపారు. కావున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని బయటకు ఎక్కువగా వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.
ఏపీలో వణికిపోతున్న జనం..
ఏపీలో కూడా పలు జిల్లాల్లో చలి జనాలకు వణికిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో అల్లూరిసీతారామరాజు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానం, అనంతపురం, నంద్యాల, కడప, కర్నూల్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, అన్నమయ్య జిల్లాలో చలిపులి పంజా విసిరింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడం వల్ల చలి తీవ్రత భారీ స్థాయిలో పెరిగిపోతుంది.
Also Read: తీవ్ర విషాదం.. చూస్తుండగానే కుప్పకూలిన విమానం.. 20 మంది గల్లంతు..
జాగ్రత్తలు..
చలి తీవ్రత పెరగడంతో చలి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లు రగ్గులు కోనుక్కోవాలి. చలి తీవ్రత పెరగడంతో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి పనులు ఉన్న ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం ఐదు గంటల లోపు ముగించుకోవాలన్నారు అధికారులు. నవంబర్ ఆరంభంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే డిసెంబర్ జనవరి నెలలో చలి ఏ స్థాయిలో ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.