BigTV English

Pawan Kalyan: మీ సేవలు అమోఘం.. తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు

Pawan Kalyan: మీ సేవలు అమోఘం.. తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు

Pawan Kalyan Congrats to IAS Krishna Teja: తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపిక కావడం హర్షణీయమని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేరళలో త్రిసూర్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు.

సేవలు ఎనలేనివి..

కృష్ణతేజ సేవలు అమోఘమని, ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించారన్నారు. కరోనా, కేరళ వరదల విపత్తు సమయాల్లో ఆయన అందించిన సేవలు మరచిపోలేనివన్నారు. బాలల పరిరక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని, దీని వెనక ఆయన కృషి ఎంతో దాగి ఉందని పవన్ కల్యాణ్ కొనియాడారు.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘స్పందన’లో మార్పులకు శ్రీకారం

పల్నాడు జిల్లా వాసి

కృష్ణతేజ సేవలు అమోఘమని, ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించారన్నారు. కరోనా, కేరళ వరదల విపత్తు సమయాల్లో ఆయన అందించిన సేవలు మరచిపోలేనివన్నారు. బాలల పరిరక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని, దీని వెనక ఆయన కృషి ఎంతో దాగి ఉందని పవన్ కల్యాణ్ కొనియాడారు.

పల్నాడు జిల్లా వాసి

ఐఏఎస్ కృష్ణతేజ ఏపీకి చెందిన వ్యక్తి కావడం గర్వంగా ఉందని పవన్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన 27న ఢిల్లీలో జాతీయ పురస్కారం అందుకోనున్నారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అయిన కృష్ణతేజ 2023 మార్చిలో కేరళ రాష్ట్రం త్రిసూర్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి ఆదుకున్నారు. దాతల సహకారంతో వీరందరికీ ఉన్నత చదువులు అందేలా భరోసా కల్పించారు. అదే విధంగా కరోనా కారణంగా భర్త చనిపోయి కుటుంబం చిన్నాభిన్నం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వితంతువులు ఇళ్లు నిర్మించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

అదే విధంగా మరో 150మందికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఆయన అంకితభావాన్ని కేరళ ప్రజలు మరచిపోలేరని పవన్ కల్యాణ్ అన్నారు.

Tags

Related News

Tirumala News: తిరుమల శ్రీవాణి టికెట్ల విక్రయాల్లో గందరగోళం.. భక్తుల నిరసనలు, కిక్కిరిసిన ఏడు కొండలు

Ambati Rambabu: అంబటి చిక్కు ప్రశ్న.. మంత్రి లోకేష్ ఎలా రియాక్ట్ అవుతారో?

Why Not Pulivendula: వైనాట్ కుప్పం.. వైనాట్ పులివెందుల

RTC mike announcement: మహిళలకు ఫ్రీ బస్.. మైక్ అనౌన్స్‌మెంట్స్ కండక్టర్ కొత్త కల్చర్!

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

Big Stories

×